Tongue Cleaning । దంతాలతో పాటు నాలుకనూ శుభ్రం చేస్తున్నారా? చేయకపోతే అంతే సంగతి!-know the importance of tongue cleaning and ways to clean properly ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tongue Cleaning । దంతాలతో పాటు నాలుకనూ శుభ్రం చేస్తున్నారా? చేయకపోతే అంతే సంగతి!

Tongue Cleaning । దంతాలతో పాటు నాలుకనూ శుభ్రం చేస్తున్నారా? చేయకపోతే అంతే సంగతి!

HT Telugu Desk HT Telugu
Dec 13, 2022 11:03 PM IST

Tongue Cleaning: దంతాలతో పాటు నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. నాలుకను ఎందుకు శుభ్రం చేసుకోవాలి, సరైన పద్ధతి ఏమి ఇక్కడ తెలుసుకోండి.

Tongue Cleaning
Tongue Cleaning (iStock)

మీరు నోటి శుభ్రత గురించి సంతృప్తిగా ఉన్నారా? ప్రతిరోజూ అందరూ తమ దంతాలను శుభ్రం చేసుకుంటారు కానీ, నాలుకను శుభ్రం చేసుకోవడం మరిచిపోతారు. బాగా బ్రష్ చేసుకొని దంతాలను మిలమిల మెరిసేలా చేసుకుంటారు. తమ తెల్లని దంతాలను చూసుకుంటూ స్మైల్ ఇస్తారు. కానీ దంతాలు మెరిసినంత మాత్రనా నోరు పూర్తిగా శుభ్రం చేసుకున్నట్లు కాదు. ప్రతి ఒక్కరు తమ దంతాలతో పాటు రోజూ తమ నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

బ్రషింగ్, ఫ్లాసింగ్ చేయడం ద్వారా మీ దంతాలు, చిగుళ్లు మాత్రమే శుభ్రపడతాయి. కానీ మీ నాలుకపైన మీ నోటిలోని 50% బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. కాబట్టి మీరు దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ బ్యాక్టీరియా దుర్వాసన, కావిటీస్, చిగుళ్ల వ్యాధికి దోహదం చేస్తుంది, రుచి మొగ్గలు కూడా చెడిపోతాయి. కాబట్టి మీరు మీ దంతాలతో పాటు మీ నాలుకను కూడా ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది.

Ways to Clean Your Tongue- నాలుకను సరిగ్గా శుభ్రం చేయడం ఎలా

నాలుకను ఎలా శుభ్రపరుచుకోవాలి, నాలుక శుభ్రపడినట్లు ఎలా నిర్ధారించుకోవాలి? మొదలైన విషయాలను ఈ కింద తెలుసుకోండి.

టూత్ బ్రష్‌తో నాలుకను శుభ్రం చేయటం

మీ నాలుకను శుభ్రం చేయడానికి సులభమైన, అత్యంత సాధారణ మార్గం టూత్ బ్రష్‌ను ఉపయోగించడం. టంగ్ క్లీనర్‌లతో వచ్చే కొన్ని టూత్ బ్రష్‌లు విరుద్ధమైన ముళ్ళను కలిగి ఉంటాయి. మీ నాలుకను టూత్ బ్రష్‌తో శుభ్రం చేస్తున్నప్పుడు, మీరు ముందుగా కొద్ది మొత్తంలో టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి, ఆపై మీ నోటి వెనుక నుండి ముందు వరకు బ్రష్ చేయడం ప్రారంభించండి. తర్వాత నీటితో నోరు శుభ్రంగా కడుక్కోండి.

టంగ్ క్లీనర్ ఉపయోగించండి

నాలుకను శుభ్రం చేయడానికి టంగ్ స్క్రాపర్ మరొక ప్రసిద్ధ మార్గం. మీరు చేయాల్సిందల్లా స్క్రాపర్‌ను మీ నాలుక వెనుక భాగంలో ఉంచి, దానిని నిరంతరం నాలుక ముందు వైపుకు లాగండి. స్క్రాపర్ టూల్‌ను మీ నాలుకపై అనేక కోణాల్లో తరలించడం ద్వారా దాగి ఉన్న అన్ని బాక్టీరియాలను తొలగించవచ్చు. ఉత్తమ ఫలితాల కోసం నీళ్ళు లేదా మౌత్ వాష్ తో మీ నోటిని శుభ్రం చేసుకోండి.

అద్దంలో మీ నాలుకను చూడండి

మీ నాలుకను స్క్రాపర్ లేదా టూత్ బ్రష్‌తో శుభ్రం చేసిన తర్వాత, అద్దంలో మీ నాలుకను ఒకసారి చూడండి. మీ నాలుక గులాబీ రంగులో ఫ్రెష్ గా కనిపిస్తే, మీరు సరిగ్గా శుభ్రం చేశారని అర్థం. ఒకవేళ నాలుక ఇంకా తెలుపు లేదా పసుపు రంగులో ఉన్నట్లు కనిపిస్తే, దాన్ని మళ్లీ శుభ్రం చేయండి.

నాలుకను ఎన్నిసార్లు శుభ్రం చేసుకోవాలి

రోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవాలని దంత వైద్యులు సలహా ఇస్తారు. అలాగే మీ నాలుకను కూడా రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోవడం ఉత్తమం. మీరు నోటి దుర్వాసన, ఫలకంను నివారించాలంటే, దీనికి ఉత్తమ మార్గం మీరు పళ్ళు తోముకున్న వెంటనే మీ నాలుకను బ్రష్ చేయడం. నిద్రపోయే ముందు ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం తగ్గుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం