తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Youtube Hacks | యూట్యూబ్​లో యాడ్​ స్కిప్​ చేసే ఆప్షన్ లేదా.. అయితే ఇది మీ కోసమే

YouTube Hacks | యూట్యూబ్​లో యాడ్​ స్కిప్​ చేసే ఆప్షన్ లేదా.. అయితే ఇది మీ కోసమే

HT Telugu Desk HT Telugu

12 May 2022, 12:01 IST

    • యూట్యూబ్​లో చిరాకు రప్పించేవి యాడ్స్. కనీసం ఇంతకుముందు 5 సెకన్లకైనా యాడ్​ స్కిప్​ చేసుకునే ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని యాడ్స్ ఎంతసేపు వచ్చినా స్కిప్ చేసే ఆప్షనే ఉండదు. అయితే  అలా 20, 40 సెకన్లు వచ్చే యాడ్స్​ను చిటికెలో స్కిప్ చేసే ఆప్షన్ ఉంది మీకు తెలుసా? తెలియకపోతే ఇది చదివేయండి.
యూట్యూబ్ యాడ్స్
యూట్యూబ్ యాడ్స్

యూట్యూబ్ యాడ్స్

YouTube Hacks | అప్పుడప్పుడు టైమ్​ పాస్​ కోసం యూట్యాబ్​ ఓపెన్ చేస్తాం. లేదా ఏదైనా ముఖ్యమైన వీడియో చూడటం కోసం యూట్యూబ్​ను చూస్తాం. కరెక్టగా అదే సమయానికి మన దగ్గర నెట్​ అయిపోతుంది. డేటా తక్కువుంటే ఎక్కువ సేపు బఫర్ అవుతుంది. లేదా ఇంటర్నెట్​ సర్వర్​ డౌన్​ ఉండొచ్చు. ఈ సమయంలోనే ఎవరో పిలిచినట్లు వస్తాయి యాడ్స్. వీడియో ఓపెన్ చేయగానే స్టార్ట్ అవుతాయి. 

ట్రెండింగ్ వార్తలు

Husband Test: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘హస్బెండ్ టెస్ట్’ ,ఈ పరీక్షను మీరూ ఒకసారి చేసేయండి

Spicy Chutney: వేడివేడి అన్నంలోకి ఇలా స్పైసీగా పుదీనా టమోటో చట్నీ చేసుకోండి, ఎంత అన్నమైనా తినేస్తారు

Mint Leave Face Pack : పుదీనా ఫేస్ ప్యాక్ వాడితే ఒక్క వారంలో మెుటిమలు, బ్లాక్ హెడ్స్ మాయం

World Asthma Day: ఆస్తమా ఉందా? ముందే జాగ్రత్త పడండి, ఆస్తమాతో పాటూ వచ్చే వ్యాధులు ఇవే

పోనిలే స్కిప్​ బటన్ కొడదాం అనుకుంటే.. అక్కడ ఆ ఆప్షన్ ఉండదు. పైగా ఆ వీడియో 20 నుంచి 40 సెకన్ల దాకా.. లేదా ఆపైనా వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. దీనిని స్కిప్ చేయడం కూడా అవదు. పైగా ఇది ఫుల్​ క్లారిటీతో ప్లే అయి.. ఉన్నా డేటాను పూర్తిగా అవగొట్టేస్తుంది. తరువాత మనకి కావాల్సిన వీడియో బఫర్ అవుతూ.. బఫర్ అవుతూ.. బఫర్​ అవుతూనే ప్లే అవుతుంది. దానిని పూర్తి చేయడానికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఒక్కోసారి చూడాలన్నా మూడ్, ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోతాయి. స్కిప్​ చేయలేని యాడ్స్ వచ్చినప్పుడు... వాటిని చూడలేక వీడియోను తర్వాత చూద్దాంలే అని యూట్యూబ్​ని క్లోజ్​ చేసేవారెందరో..

జస్ట్ సింపుల్ స్టెప్స్..

అయితే మీ కోసమే ఓ చక్కటి చిట్కాను మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ తరహా యాడ్​లను చూసే గోల లేకుండా.. మీకు నచ్చిన, అవసరమైన వీడియోను ఆస్వాదించాలంటే.. మీరు దీనిని ఫాలో అవ్వాల్సిందే. పైగా దీనిని చేయడానికి మీకు ఇంకో యాప్​ కూడా అవసరం లేదు. మీరు యూట్యూబ్​ తెరిచినప్పుడు.. స్కిప్​ ఆప్షన్​ లేని యాడ్ వస్తుంటే.. యాడ్ డ్యూరేషన్ దగ్గర ఉండే ‘ఐ’ బటన్​ని నొక్కాలి. తర్వాత స్టాప్ సీయింగ్ దిస్​ యాడ్​ బటన్​ను ప్రెస్​ చేయాలి. తర్వాత యస్ కొట్టి.. అక్కడ వచ్చే ఆప్షన్​లలో ఏదొక దానిని ఎంచుకోవాలి. అంతే సింపుల్. వెంటనే మీకు కావాల్సిన వీడియో ప్లే అయిపోతుంది. ఇంకేముంది ఈ చిట్కాను మీరు వాడేయండి. మీ ఫ్రెండ్స్​కి షేర్ చేసేయండి.

టాపిక్