తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Styling Tips: రెడ్ డ్రెస్ వేసుకున్నప్పుడు మరింత స్టైల్ గా కనిపించడం ఎలా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి చాలు

Styling Tips: రెడ్ డ్రెస్ వేసుకున్నప్పుడు మరింత స్టైల్ గా కనిపించడం ఎలా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి చాలు

Ramya Sri Marka HT Telugu

21 December 2024, 19:30 IST

google News
  • Styling Tips: రెడ్ కలర్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ సరైన స్టైలింగ్ లేనప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకున్న అద్భుతం అనిపించలేరు. రెడ్ కలర్ వేసుకున్నప్పుడు మరింత అందంగా కనిపించాలంటే ఎలా స్టైల్ చేయాలో సంజనా త్రిపాఠి ఇక్కడ వివరించారు.

     

రెడ్ డ్రెస్ వేసుకున్నప్పుడు మరింత స్టైల్ గా కనిపించడం ఎలా?
రెడ్ డ్రెస్ వేసుకున్నప్పుడు మరింత స్టైల్ గా కనిపించడం ఎలా?

రెడ్ డ్రెస్ వేసుకున్నప్పుడు మరింత స్టైల్ గా కనిపించడం ఎలా?

ఎరుపు ఆత్మవిశ్వాసం, శక్తి, ప్రకాశాన్ని సూచించే రంగు. ఇది తనంతట తానుగా సంపూర్ణంగా ఉంటుంది. స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు. ఇది ఎల్లప్పుడూ ట్రెండ్ లో ఉంటుంది. ముఖ్యంగా వివాహాలు, పార్టీలు, ఫ్యాషన్ షోలు, మతపరమైన వేడుకల్లో ఎక్కువ మంది ఎంచుకునే రంగు రెడ్. ఈ కలర్ అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా మహిళలు రెడ్ డ్రెస్ వేసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. మీకూ రెడ్ కలర్ అంటే చాలా ఇష్టమా? మీరు ఈ రంగును ధరించాలనుకుంటే తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎరుపు రంగు వేసుకున్నప్పుడ మరింత అందంగా, స్టైల్ గా కనిపించాలంటే ఈ స్టైలింగ్ ట్రిక్స్ కూడా నేర్చుకోవాలి.

ఎరుపు రంగును ఇలా ఎంచుకోండి:

మరింత కాంతివంతంగా కనిపించాలంటే:

ప్రతి రంగుకు షేడ్స్ ఉన్నట్టే రెడ్ కలర్ కు కూడా అనేక రకాలైన షేడ్స్ ఉన్నాయి. మీరు రంగుకు సరిపడా కలర్ ఎంచుకోవడమనేది మీ ఛాయీస్. మరింత కాంతివంతంగా కనిపించాలంటే స్కార్లెట్ లేదా చెర్రీ రెడ్ వంటి కలర్ ఎంచుకోవడం బెటర్. ఇవి ధరించడం వల్ల మరింత కాంతివంతంగా కనిపిస్తారు. ఇది చాలా తెలివైన నిర్ణయం కూడా. అలా కాకుండా మొఖంపై సహజమైన మెరుపును కోరుకుంటూ ఉంటే, ఎరుపు లేదా ఇటుక ఎరుపును ధరించండి.

రెడ్ డ్రెస్ వేసుకున్నప్పుడు మిగతావి లైట్:

సాధారణంగానే రెడ్ కలర్ కంటే డామినేషన్ కలర్ ఇంకొకటి ఉండదు. కాబ్టి రెడ్ కలర్ డ్రెస్ ధరించినప్పుడు ఇతర యాక్సెసరీలు ధరించాల్సిన అవసరం లేదు. ఇది దృష్టిలో ఉంచుకుని మీ బట్టలకు తగ్గట్టుగా ఓ మోస్తారు యాక్సెసరీలను ధరించండి. చిన్న బంగారు లేదా వెండి నెక్లెస్, మెటల్ చెవిపోగులు వంటివి సరిపోతాయి. కాలికి వేసుకునే పాదరక్షల విషయంలో నలుపు లేదా ఎరుపు రంగులను ఎంచుకోవడం ఉత్తమం. రెడ్ డ్రెస్ వేసుకున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం.. అట్రాక్షన్ పెంచుకోవడానికి రెడ్ కలర్‌తో పాటుగా, మరే ఇతర రంగులు ధరించాల్సిన అవసరం లేదు.

కాంబినేషన్ కోసం ఇవి ట్రై చేయండి

రెడ్ కలర్‌ను టాప్ అండ్ బొటమ్ (పై నుంచి కింది వరకూ) ధరించడం మీకు ఇష్టం లేకపోతే వాటికి బదులుగా మరేదైనా ఇతర సహజ రంగులను కాంబినేషన్ గా వాడుకోవచ్చు. ఎరుపు రంగు స్కర్ట్‌తో బ్లాక్ లేదా వైట్ టాప్, ఎరుపు రంగుతో బ్లాక్ ప్యాంట్ వంటి కాంబినేషన్లు మీకు బ్యాలెన్స్‌డ్ లుక్‌ను ఇస్తాయి. తెలుపు, నలుపు దుస్తులను ఎరుపు రంగుతో లేయర్ చేయడం ద్వారా మీరు బ్యాలెన్స్‌డ్ లుక్ సొంతం చేసుకోవచ్చు. బ్లూ జీన్స్‌తో ఒక జత రెడ్ కార్డిగన్ లు కూడా అందంగా కనిపిస్తాయి.

సందర్భాన్ని బట్టి షేడ్

మీ రెడ్ డ్రెస్ లుక్ మరింత పెంచుకోవడానికి పలు రకాల డిజైన్లలో ప్రయత్నించవచ్చు. నైట్ పార్టీ సమయంలో ధరించాల్సి వస్తే శాటిన్, వెల్వెట్ లేదా లేస్ ఫ్యాబ్రిక్లో ఎరుపు రంగును ధరించండి. అదే సమయంలో స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాలనుకుంటే ఎరుపు రంగు డెనిమ్, లినిన్, కాటన్ లలో కూడా బాగుంటుంది.

రెడ్ డ్రెస్ లో అలర్ట్ గా ఉండాలి

రెడ్ కలర్ ధరించడం ఇష్టమైతే, ఆ రంగు డ్రెస్‌లను పూర్తి ఆత్మవిశ్వాసంతో ధరించండి. ఎరుపు రంగు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాబట్టి వీటిని ధరించడానికి సంకోచించకండి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ హుందాతనంతో కూడిన కదలికలతో వ్యవహరించండి. క్రమం తప్పకుండా నవ్వండి. ఏ రంగు ప్రకాశమైనా మీ ఆత్మవిశ్వాసం కంటే ముందు ప్రకాశిస్తుంది. ఎరుపు రంగు దీనికి మినహాయింపు కాదు.

ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం:

ప్రతి ఐదుగురిలో ఇద్దరు మహిళలు ఆఫీసుకు ఎరుపు రంగు దుస్తులు లేదా యాక్సెసరీలు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తాజా సర్వేలో తేలింది. అదే సమయంలో సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది ఆఫీసులో ఎరుపు రంగు వేసుకునే ధైర్యం లేదని అంగీకరించారు. రెడ్ లిప్ స్టిక్ ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సర్వేలో పాల్గొన్న మహిళల్లో 26 శాతం మంది చెప్పారు. బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ ఈ సర్వే నిర్వహించింది.

తదుపరి వ్యాసం