తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sleeping With Room Heater On Can Be Fatal, Must Follow These Safety Tips During Winters

Room Heater Safety Tips | రూమ్ హీటర్‌లను ఉపయోగిస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Manda Vikas HT Telugu

10 January 2023, 19:42 IST

    • Room Heater Safety Tips: రూమ్ హీటర్ ఆన్ లో ఉంచి నిద్రపోకూడదు. ఈ చలికాలంలో హీటర్స్ ఉపయోగిస్తుంటే ఈ భద్రతా చిట్కాలను పాటించండి.
Room Heater Safety Tips
Room Heater Safety Tips (Shutterstock)

Room Heater Safety Tips

ఎండాకాలం వచ్చినపుడు ఏసీల వినియోగం పెరిగినట్లే, చలికాలంలో హీటర్లు, గీజర్ల వాడకం పెరుగుతుంది. చాలా మంది ఈ శీతాకాలంలో తమ గదిని వెచ్చగా ఉంచడానికి రూమ్ హీటర్‌లను ఉపయోగిస్తారు. తమని తాము, తమ కుటుంబాన్ని చలి నుంచి రక్షించుకునేందుకు గదిలో నిద్రించేటపుడు ఈ హీటర్‌లను ఆన్ చేసి పడుకుంటారు. నిజమే, ఈ గది హీటర్లు మిమ్మల్ని వెచ్చగా, హాయిగా ఉంచగలవు. కానీ ఇవి మీ ఆరోగ్యానికి హానికరమే కాకుండా చాలా ప్రమాదకరం కూడా.

ట్రెండింగ్ వార్తలు

Oatmeal omelette: బ్రేక్ ఫాస్ట్ కోసం ఇలా ఓట్స్ ఆమ్లెట్ చేసుకోండి, డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉత్తమ అల్పాహారం

Thursday Motivation: పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి, అది మీలో తెలివిని, ధైర్యాన్ని నింపుతుంది

Covishield vaccine: కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల వస్తున్న అరుదైన ప్రాణాంతక సమస్య టిటిఎస్, ఇది రాకుండా ఎలా జాగ్రత్త పడాలి?

World Tuna Day 2024: టూనా చేప రోజూ తింటే బరువు తగ్గడంతో పాటూ గుండెపోటునూ అడ్డుకోవచ్చు

ఈ శీతాకాలంలో రూమ్ హీటర్‌లను ఉపయోగించడం మంచి ఆలోచన కాదు అని చెప్పటానికి కారణాలు ఉన్నాయి. గది హీటర్లు పొడి చర్మానికి దారితీస్తాయి, అలెర్జీల లక్షణాలను విస్తరింపజేస్తాయి. ఇంకా ఏమిటంటే, గది హీటర్‌ని ఆన్‌లో ఉంచి నిద్రించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు పెరిగి ప్రాణాంతకంగా మారవచ్చు. రూమ్ హీటర్‌లను ఉపయోగించి నిద్రపోయే వారు శ్వాస ఆడక చనిపోయిన ఘటనలు ఉన్నాయి.

ఇది గాలిలో తేమ శాతాన్ని తగ్గిస్తుంది

చలికాలం వాతావరణం పొడిగా, కఠినంగా ఉంటుంది, అయితే మీ గదిలో ఎక్కువసేపు హీటర్‌ని ఉపయోగించడం వల్ల గాలిలో తేమ శాతం తగ్గుతుంది, ఇది మరింత పొడిగా మారుతుంది. పొడి గాలి మీ చర్మానికి సమస్యలు కలిగిస్తుంది. మీకు సున్నితమైన చర్మం ఉంటే, అది ఎరుపు, దురదకు దారితీస్తుంది.

ఇది ఇండోర్ గాలిని విషపూరితం చేస్తుంది

కొన్ని మోడళ్ల గది హీటర్లు కార్బన్ మోనాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. ఆ వాయువులను మీ గది సరిగ్గా వెంటిలేషన్ చేయకపోతే, మీరు హీటర్‌ని ఆన్ చేసి నిద్రిస్తే, అది నిజంగా ప్రమాదకరం. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.

కార్బన్ మోనాక్సైడ్ (CO) అనేది ఒక విషపూరితమైన, రంగులేని, రుచిలేని, వాసన లేని వాయువు. ఇది కలప, బొగ్గు, గ్యాసోలిన్, చార్ కోల్, సహజ వాయువు లేదా కిరోసిన్ వంటి కార్బన్‌లను కలిగి ఉన్న ఇంధనాలను అసంపూర్తిగా కాల్చడం వల్ల ఉత్పత్తి అవుతుంది.

ఈ కార్బన్ మోనాక్సైడ్ పొగలను పీల్చడం వల్ల రక్తానికి ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తక్కువ ఆక్సిజన్ స్థాయిలు మెదడు, గుండె వైఫల్యాలకు దారితీసి మరణానికి కారణం కావచ్చు. రక్తహీనత, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు, పుట్టబోయే పిల్లలు, శిశువులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు ఈ వాయువు పీల్చడం ప్రాణాంతకం.

ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు సమస్యలను కలిగిస్తాయి

వెచ్చని గదిలో కూర్చోవడం మంచి అనుభూతిని కలిగిస్తుంది, కానీ మీరు దాని నుండి బయటకు వెళ్లినప్పుడు, మీ శరీరం ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఉష్ణోగ్రతలలో ఈ ఆకస్మిక మార్పు తరచుగా మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది, మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

Room Heater Safety Tips - రూమ్ హీటర్‌ కోసం భద్రతా చిట్కాలు

  • మీరు ఈ శీతాకాలంలో రూమ్ హీటర్‌ను తరచుగా ఉపయోగించే వారైతే, మీ ఇంట్లో హీటర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఈ భద్రతా చిట్కాలను గుర్తుంచుకోండి.
  • మీ ఇంటిలో రూమ్ హీటర్‌తో పాటుగా కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్‌ను అమర్చండి.
  • కనీసం సంవత్సరానికి ఒకసారి మీ గ్యాస్ హీటర్‌ను ప్రొఫెషనల్‌తో తనిఖీ చేయించండి. ఏవైనా లీక్‌లు లేదా పగుళ్ళు ఉంటే మరమత్తులు చేయించండి.
  • మీరు పొయ్యిని ఉపయోగిస్తుంటే చెత్త, కార్డ్‌బోర్డ్ పెట్టెలు లేదా మీ ఇంటిని విషపూరితం చేసే రసాయనాలను కలిగి ఉన్న వస్తువులను కాల్చవద్దు.
  • ఎలక్ట్రిక్ స్పేస్ హీటర్ సురక్షితమైన చోట ఉంచండి. హీటర్ పరిసరాలలో నీరు లేదా కర్టెన్లు, కాగితం, దుప్పట్లు లేదా ఫర్నిచర్ వంటి మండే వస్తువులు లేవని నిర్ధారించుకోండి.
  • విద్యుత్ షాక్ లేదా అగ్నిని కలిగించే తప్పు వైరింగ్ కోసం తనిఖీ చేయండి.
  • స్పేస్ హీటర్ల చుట్టూ పిల్లలు, పెంపుడు జంతువులు తిరగకుండా పర్యవేక్షించండి.
  • ఉష్ణోగ్రతను మితంగా ఉంచండి, మీ గది వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోండి
  • గది నుండి బయలుదేరే ముందు లేదా నిద్రపోయే ముందు హీటర్లను ఆఫ్ చేయండి.
  • అలాగే ఈ చలికాలంలో స్వెటర్లతో నిద్రించకూడదు, ఎందుకో ఈ లింక్ చూడండి.

చివరగా చెప్పేదేమిటంటే, చల్లని వాతావరణంలో హాయిగా దుప్పటి కప్పుకుని పడుకోవడం కంటే మించిన స్వర్గం మరొకటి ఉండదు.