Egg Upma | కోడిగుడ్డుతో ఉప్మా.. సండే బ్రేక్‌ఫాస్ట్‌ని ఇలా ట్రై చేయండి!
07 May 2023, 6:36 IST
- Egg Idli Upma Recipe: ఆదివారం పూట ఏదైనా ప్రత్యేకమైన అల్పాహారం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ కోడిగుడ్డు ఉప్మా రెసిపీని ట్రై చేయండి.
Egg Idli Upma Recipe (istock)
Egg Idli Upma Recipe
Recipe of The Day: మీరు బ్రేక్‌ఫాస్ట్‌గా ఉప్మాను చాలా సార్లు తినే ఉంటారు. మరి కోడిగుడ్డు ఉప్మాను ఎప్పుడైనా తిన్నారా? ఈ రెసిపీ వినడానికి వింతగా ఉన్నా, తినడానికి రుచికరంగానే ఉంటుంది. అయితే దీనిని మీరు ఉప్మారవ్వతో చేయకూడదు, ఇడ్లీలతో చేయాల్సి ఉంటుంది. మీరు ఇదివరకే సిద్ధం చేసిన ఇడ్లీలను ఉపయోగించి లేదా మిగిలిన ఇడ్లీలను ఉపయోగించి ఈ కోడిగుడ్డు ఉప్మాను తయారు చేయవచ్చు. దీనిని కోడిగుడ్డు ఇడ్లీ ఉప్మాగా పిలవచ్చు. దీని రెసిపీ ఇక్కడ ఉంది, మీ సండే బ్రేక్‌ఫాస్ట్‌ని ఇలా ఓసారి ట్రై చేయండి.
Egg Idli Upma Recipe కోసం కావలసినవి
- ఇడ్లీలు - 4
- గుడ్లు - 2
- ఉల్లిపాయ - 1
- కరివేపాకు - 1 రెమ్మ
- పసుపు పొడి - 1/4 tsp
- మిరియాల పొడి - 1/4 tsp
- సాంబార్ పొడి - 1/2 tsp
- ధనియాల పొడి - 1/2 tsp
- ఆవాలు - 1/2 tsp
- నూనె - 1 స్పూన్
- ఉప్పు - రుచి కోసం
- కొత్తిమీర ఆకులు - గార్నిషింగ్ కోసం
కోడిగుడ్డు ఇడ్లీ ఉప్మా తయారీ విధానం
- ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయండి. వేడి అయ్యాక, ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి.
- ఆ తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
- అందులోనే పసుపు, కారం, సాంబారు పొడి, ధనియాల పొడి, అవసరమైన మేర ఉప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి
- ఇప్పుడు గుడ్లు పగలకొట్టి వేయండి బాగా గిలక్కొడుతూ కలుపుతూ ఉండండి.
- ఇప్పుడు మంట తగ్గించి, ఇడ్లీలను చిన్నముక్కలుగా సుంచి వేయండి. అన్నీ బాగా కలిపేయండి.
- చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయండి. అవసరమైతే కొన్ని చుక్కల నిమ్మరసం పిండండి.
అంతే, కోడిగుడ్డు ఇడ్లీ ఉప్మా రెడీ. వేడివేడిగా తినండి, కాఫీ తాగుతూ మీ బ్రేక్‌ఫాస్ట్‌ని ఆస్వాదించండి.