Eggs vs Veggies । కోడిగుడ్డు కంటే ఎక్కువ పోషకాలు కలిగిన కూరగాయలు ఇవే!
Eggs vs Veggies: బరువు తగ్గించే ఆహారంలో ఉడికించిన గుడ్లు చేర్చుకోమంటారు. మీకు గుడ్లు తినడం ఇష్టం లేదా? అయితే గుడ్లకు మించిన పోషకాలు కలిగిన కూరగాయలు ఏమున్నాయో చూడండి.
Eggs vs Veggies: మన శరీరంలోని వివిధ కణాల పెరుగుదలకు, శరీర అభివృద్ధికి, పిల్లలు ఎత్తు పెరగటానికి, అధిక బరువును నియంత్రించుకోవటానికి ప్రోటీన్ అవసరం అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరానికి రోజువారీ ప్రోటీన్ అవసరాలను తీర్చడం చాలా ముఖ్యం, శరీరంలో మాంసకృత్తులు లేకపోవడం వల్ల వివిధ లోపాలు, అనారోగ్యాలు సంభవించవచ్చు.
చాలా మంది గుడ్లు లేదా మాంసాహార మూలాల నుండి మాత్రమే ప్రోటీన్ పొందవచ్చని నమ్ముతారు, అయితే ఇది అపోహ. శాకాహారులు కూడా ఆకుపచ్చ కూరగాయల నుండి తగినంత ప్రోటీన్‌ను కూడా పొందవచ్చు, కొన్ని శాకాహార పదార్థాలు గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. దట్టమైన ప్రోటీన్‌తో నిండిన ఆకుపచ్చ కూరగాయలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
కాలీఫ్లవర్
కాలీఫ్లవర్, బ్రోకలీలలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది, ఇవి గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయి. క్యాలీఫ్లవర్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో కొవ్వు, కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఈ కూరగాయలు మంచి ప్రోటీన్ ఆహారాలు. కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా, క్యాలీఫ్లవర్‌లో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ కె, విటమిన్ సి వాంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి, ఇవి క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి.
పచ్చి బఠానీలు
పచ్చి బఠానీలు రుచికరమైనవే కాదు, అవి ప్రోటీన్‌కు గొప్ప మూలం కూడా. పచ్చి బఠానీలు మీ శరీరానికి అధిక ప్రోటీన్ కంటెంట్‌ను అందివ్వడమే కాకుండా, శరీరంలోని అధిక కొవ్వును, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి. అదనంగా వీటిలో మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్, ఫోలేట్, జింక్, ఐరన్, మాంగనీస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, ఇవి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. పచ్చి బఠానీలలో ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియెంట్‌లు ఉంటాయి, అవి పెద్దప్రేగు క్యాన్సర్‌ను నిరోధించగలవని తేలింది.
పాలకూర
పాలకూర అనేక పోషకాలకు కేంద్రం, ఈ ఆకుకూర ఆరోగ్య ప్రయోజనాలను సమృద్ధిగా అందిస్తుంది. పాలకూరలో మంచి ప్రోటీన్ పదార్థం ఉండటమే కాకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అమైనో ఆమ్లాలతో నిండి ఉంటుంది. ఇందులో ప్రోటీన్‌తో పాటు, విటమిన్ ఎ, విటమిన్ కె , విటమిన్ సి వంటి ముఖ్యమైన విటమిన్లు కూడా ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
సంబంధిత కథనం