తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aquarius Horoscope | కుంభరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

Aquarius Horoscope | కుంభరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

HT Telugu Desk HT Telugu

01 April 2022, 17:40 IST

    • కుంభ రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు ఎలా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వారి ఆర్థికపరిస్థితి, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది. శ్రీ శుభకృత్​ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా కుంభ రాశి గురించి తెలుసుకుందాం.
కుంభరాశి ఫలితములు
కుంభరాశి ఫలితములు

కుంభరాశి ఫలితములు

Ugadi Panchangam | ధనిష్ఠ - 3,4వ పాదములు, శతాభిషం - 1,2,3,4 పాదములు, పూర్వాభాద్ర- 1,2,3 పాదములు

* ఆదాయం - 5

* వ్యయం - 2

* రాజ్యపూజ్యం - 5

* అవమానం - 4

శ్రీ శుభకృత్ నామసంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి 2వ స్థానమందు సంచరించుట, శని 1వ స్థానము, వక్రియై 12వ స్థానమునందు సంచరించుట, రాహువు మాతృ స్థానమగు 3వ స్థానమునందు సంచరించుట, కేతువు 9వ స్థానమునందు సంచరించుట చేత కుంభరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితములు ఉన్నవి. కుంభరాశి వారికి రాహువు కేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం ఉద్యోగంలో ఒత్తిళ్లు ఉన్నప్పటికి కలిసిరావడం, వ్యాపారము చెడు ఫలితాలతో ముందుకు కొనసాగడం వంటివి జరుగును. 3వ ఇంట రాహువు ప్రభావముచేత కుటుంబంలో కొంతకాలంగా ఉన్న సమస్యలు తొలగును.

ఏప్రిల్ నుంచి డిసెంబర్ సమయంలో శని వక్రియై 12వ స్థానమందు (ఏలినాటి శని) సంచరించుట చేత కుటుంబపరంగా, ఉద్యోగ, వ్యాపార పరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడును. బృహస్పతి 2వ స్థానములో సంచరించుట ధనలాభము కలుగును. 2వ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత కుంభరాశి వారికి ఈ సంవత్సరం ధన విషయంలో కొంతమేర కలిసి వచ్చును. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఉద్యోగ, వ్యాపారములలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావముచేత వృత్తి ఉద్యోగ, ఆరోగ్య, కుటంబ, కోర్టు వ్యవహారములందు జాగ్రత్త వహించవలెను.

<p>చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ</p>

కుంభ రాశివారికి ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు ప్రతికూలముగా ఉన్నది. జనవరి 2023 నుంచి ఏప్రిల్ 2023 మధ్య మధ్యస్థ నుంచి చెడు ఫలితములు కలుగును. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది. అప్పులు తెచ్చుకునే పరిస్థితి కనబడుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. అప్పుల భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. స్త్రీలకు కుటుంబంలో సమస్యలు, అనారోగ్య సూచనలు ఉన్నవి. కుంభరాశి వారు ఆరోగ్య విషయములందు జాగ్రత్త వహించవలెను. వాహనములు మీద ప్రయాణించేప్పుడు జాగ్రత్త వహించవలెను. ప్రమాదములకు లోనయ్యే పరిస్థితి ఉంది. రైతులకు, సినీరంగం వారికి అంత అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలి అనుకుంటే.. ఆదివారం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రము పఠించండం, గురువారం దక్షిణామూర్తిని పూజించడం, శనివారం శివాభిషేకం చేయడం ఉత్తమం.

మాసవారి ఫలితములు

ఏప్రిల్ - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతికూలం. ఆదాయం తగ్గుతుంది. గృహెపకరణాలు కొంటారు. ఇతరులతో చికాకులు కలుగును.

మే - ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఆందోళన, సోదరులకు మంచిది కాదు. మంచి ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు మంచి సలహా ఇస్తారు.

జూన్ - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. దూరప్రయాణాలు, శారీరకంగా, మానసిక ఆందోళన, బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు కలుగును. నూతన వస్తు, వాహన, వస్త్ర, ఆభరణ లాభములు.

జూలై - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. మానసిక సంతోషము, ఇతరులకు సహాయము చేయుట, ఇంటినందు శుభకార్యములు జరుగును. వస్త్రాభరణ లాభము, భూ లాభము కలుగును.

ఆగస్టు - ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. గతంలో గల బాధలన్నీ తొలగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శుభ ఫలితములు పొందుతారు.

సెప్టెంబర్ - ఈ మాసం అనుకూలంగా లేదు. చికాకులు కలుగును. ఇతరులతో గొడవలు, స్త్రీ పురష కారణంగా ఇబ్బందులు, సుఖశాంతులు లేకపోవుట. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు చెడు అనుభవాలు.

అక్టోబర్ - ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయి. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. సంతాన మూలంగా చికాకులు. ఆర్థికాభివృద్ధి కలుగును.

నవంబర్ - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఆర్థికపరమైన ఇబ్బందులు, ప్రమాదములు, శత్రుబాధలు, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఎక్కువగా శ్రమపడవలసి వస్తుంది.

డిసెంబర్ - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అకాల భోజనము, కష్టాలను ఎదుర్కొనుట, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

జనవరి - ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. అనారోగ్య సమస్యలు కుదుటపడతాయి. వాహనములు కొనుగోలు, సుఖసంతోషాలు, పలు విధాలుగా ఆదాయము లభించును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో లాభనష్టాలుండును.

ఫిబ్రవరి - ఈ మాసం మీకు అంత అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శుభ ఫలితములు. గృహమునందు గొడవలు. ఖర్చులు పెరుగును.

మార్చి - ఈ మాసం మధ్యస్థం నుంచి అనుకూలంగా ఉన్నది. వ్యాపారాలందు ముందడుగు, దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. పనులన్నీ నిదానంగా సాగుతాయి. అధికముగా ధనం ఖర్చగును. అనారోగ్య సూచనలు.

టాపిక్