తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Realme Narzo 50i Prime। అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో అమ్మకానికి సిద్ధం!

Realme Narzo 50i Prime। అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో అమ్మకానికి సిద్ధం!

HT Telugu Desk HT Telugu

14 September 2022, 21:36 IST

    • Realme Narzo 50i Prime ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదల అయింది. ఇది రూ. 9 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది. వివరాలు చూడండి.
Realme Narzo 50i Prime
Realme Narzo 50i Prime

Realme Narzo 50i Prime

చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ మేకర్ రియల్‌మి తాజాగా రెండు ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో ఒకటి Realme C30s కాగా, మరొకటి Realme Narzo 50i Prime. ఈ రెండూ కూడా రూ. 7 వేల బడ్జెట్ ధరలో లభించే రెండు విభిన్నమైన హ్యాండ్ సెట్లు. Realme Narzo 50i Prime విషయానికి వస్తే ఇది Narzo సిరీస్‌లో వచ్చిన 6వ స్మార్ట్‌ఫోన్‌. కొన్ని నెలల క్రితం చైనాలో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు కంపెనీ ఇప్పుడు ఇండియాలోనూ ప్రవేశపెట్టింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ డార్క్ బ్లూ, మింట్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. దీని బ్యాక్ ప్యానెల్ ప్రత్యేకమైన నమూనా డిజైన్‌తో వస్తుంది, ఇది చేతులకు మెరుగైన గ్రిప్‌ను అందిస్తుంది. ర్యామ్ స్టోరేజ్ ఆధారంగా ఈ ఫోన్‌ రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. గరిష్ట స్టోరేజ్ కెపాసిటీ 64GBగా ఉంది. అయితే మైక్రో SD కార్డ్‌ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు.

Realme Narzo 50i Primeలో మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత? తదితర వివరాలను ఈ కింద చూడండి.

Realme Narzo 50i Prime స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
  • 3GB/4GB RAM, 32GB/64GB స్టోరేజ్ సామర్థ్యం
  • యునిసోక్ T612 ప్రాసెసర్
  • వెనకవైపు 8 MP కెమెరా LED ఫ్లాష్; ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఫాస్ట్ ఛార్జర్

కనెక్టివిటీ కోసం, సింగిల్ బ్యాండ్ 2.4Ghz Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS/GLONASS, మైక్రో USB పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ మొదలైనవి ఉన్నాయి.

Realme Narzo 50i Prime ధర 3GB + 32GB మోడల్‌కు రూ. 7,999/-

4GB + 64GB వెర్షన్ కోసం రూ. 8,999/-

ఆశ్చర్యకరంగా, Realme Narzo 50i Prime ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేయడం నిరాశపరిచే అంశం. దీనికంటే రూ. 1,499 తక్కువ ధరతో కొత్తగా లాంచ్ అయిన Redmi A1 వంటి ఫోన్, కొత్త ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌లో పనిచేయటం గమనార్హం.

సెప్టెంబర్ 23 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ అమెజాన్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే Realme వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

టాపిక్