తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Greenmirchi Chutney: పచ్చిమామిడి పచ్చిమిర్చి పచ్చడి, ఈ రెండింటి కాంబినేషన్లో స్పైసీ చట్నీ అదిరిపోతుంది

Mango Greenmirchi Chutney: పచ్చిమామిడి పచ్చిమిర్చి పచ్చడి, ఈ రెండింటి కాంబినేషన్లో స్పైసీ చట్నీ అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

26 June 2024, 12:00 IST

google News
    • Raw Mango Greenmirchi Chutney: పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి కలిపి స్పైసీ పచ్చడి చేసుకుంటే టిఫిన్స్‌లోకి, అన్నంలోకి రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు.
పచ్చి మామిడి పచ్చిమిర్చి చట్నీ
పచ్చి మామిడి పచ్చిమిర్చి చట్నీ

పచ్చి మామిడి పచ్చిమిర్చి చట్నీ

Raw Mango Greenmirchi Chutney: వేసవిలోనే తాజాగా పచ్చి మామిడికాయలు దొరుకుతాయి. ఈ పచ్చి మామిడికాయతో ఒకసారి పచ్చడి చేసుకొని చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మేము పచ్చిమిర్చి, పచ్చి మామిడికాయ కలిపి చేసే స్పైసి చట్నీ రెసిపీ ఇచ్చాము. దీన్ని ఇడ్లీ, దోశ, ఊతప్పం వంటి టిఫిన్లలోకే కాదు, వేడివేడి అన్నంలో కలుపుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి వండుకొని చూడండి మీకు నచ్చడం ఖాయం. పుల్లపుల్లగా కారం కారంగా ఉండే చట్నీకి మీరు కచ్చితంగా అభిమాని అయిపోతారు. పచ్చి మామిడికాయలు సీజనల్‌గా దొరుకుతాయి. కాబట్టి ఇలాంటి సీజనల్ ఆహారాన్ని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక పచ్చిమామిడి పచ్చిమిర్చి కలిపి చేసే ఈ పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పచ్చిమామిడి పచ్చిమిర్చి స్పైసీ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పచ్చి మామిడికాయ - ఒకటి

పచ్చిమిర్చి - పది

నూనె - ఒక స్పూను

ఆవాలు - అర స్పూను

వేరుశనగ పలుకులు - అరకప్పు

కరివేపాకులు - గుప్పెడు

జీలకర్ర - అరస్పూను

మినప్పప్పు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి స్పైసీ చట్నీ

1. ముందుగా వేరుశెనగ పలుకులను రెండు గంటల పాటు నీటిలో నానబెట్టాలి.

2. ఇలా నానబెట్టడం వల్ల అవి పచ్చిగా మారుతాయి.

3. ఆ తర్వాత మిక్సీ జార్లో ఈ నానబెట్టిన వేరుశెనగ పలుకులను, పచ్చి మామిడికాయ ముక్కలను, పచ్చిమిర్చిని, ఉప్పు వేసి కాస్త నీళ్లు చేర్చి రుబ్బుకోవాలి.

4. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

6. నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, కరివేపాకులు వేసి బాగా వేయించుకొని పచ్చడిపై తాళింపు వేసుకోవాలి.

7. అంతే స్పైసీ పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి చట్నీ రెడీ అయిపోతుంది.

8. ఇది పది నిమిషాల్లో వండేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీని ఇడ్లీతో తిని చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందో.

9. పచ్చిమామిడికాయను పుల్లగా ఉన్నవి తీసుకుంటే రుచిగా ఉంటుంది. సాధారణంగా ఉన్నది, కాస్త తీపిగా ఉన్నది ఎంచుకుంటే ఈ చట్నీ టేస్ట్ అంతగా తెలియదు. కాబట్టి పుల్ల మామిడితోనే ఈ రెసిపీని ప్రయత్నించండి.

సీజనల్ గా దొరికే పచ్చిమామిడిని తినడం చాలా అవసరం. దీనిలో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. కాబట్టి గుండె జబ్బులు ఉన్నవాళ్లు పచ్చి మామిడి తింటే ఎంతో మంచిది. దీన్ని రెగ్యులర్‌గా తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి ఎన్నో రకాల రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఎప్పుడైతే అదుపులో ఉంటుందో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పచ్చిమామిడిని ఇలా వంటల రూపంలో తింటే ఎంతో మంచిది. పచ్చిమామిడితో చేసే పప్పు కూడా రుచిగానే ఉంటుంది. ఒక్కసారి ఈ పచ్చి మామిడి పచ్చిమిర్చి రెసిపీని ప్రయత్నించి చూడండి. మీకు నచ్చడం ఖాయం.

తదుపరి వ్యాసం