తెలుగు న్యూస్  /  Video Gallery  /  Psychologist Rajvinder Samra On Tackling Burnout

ప్రేరణ లేని ఉద్యోగం.. బర్న్‌అవుట్ అవుతున్న ఉద్యోగులు.. ఈ కోపం తగ్గేదెలా!

01 July 2022, 21:20 IST

కరోనా వ్యాప్తి నుండి మనుషుల నడవడికలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వృత్తిపరమైన జీవితంలో ఊహించలేని విధంగా మార్పులు జరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్(WFH) అనే వర్కింగ్ బాగా కల్చర్ పెరిగింది. వర్చువల్ పని విధానానికి బాగా అలవాటు పడ్డారు ఉద్యోగులు. WFH విధానం ఉద్యోగులు స్వాగతిస్తున్నప్పటికీ ఆర్గనైజేషనల్‌ స్ట్రక్చర్‌, సహకారం, పరస్పర చర్య, ప్రేరణ లేని కారణంగా చాలా మంది ఉద్యోగులు బర్న్‌అవుట్, ఒంటరితనం, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన నిర్వచనం ప్రకారం, విజయవంతంగా నిర్వహించబడని దీర్ఘకాలిక వర్క్‌ప్లేస్ ఒత్తిడి వల్ల బర్న్‌అవుట్ ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఉద్యోగుల పనిపై దృష్టి సారించడానికి UKకు చెందిన మనస్తత్వవేత్త రాజ్‌విందర్ సమ్రా సలహలు ఇస్తున్నారు. బర్న్‌అవుట్‌ను నివారించడానికి సంస్థలు ఏమి చేయగలవు అనే దాని గురించి వివరించారు