తెలుగు న్యూస్  /  Lifestyle  /  Oppo K10x Smartphone Launched As A Rebranded Version Of Realme V25 5g, Details Here

OPPO K10x । ఒప్పో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. కానీ ఆ ఫోన్‌‌కు రీబ్రాండెడ్ వెర్షనే!

HT Telugu Desk HT Telugu

19 September 2022, 15:34 IST

    • ఒప్పో సరికొత్త OPPO K10x స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ భారీగా పెరిగింది. వివరాలు చూడండి.
OPPO K10x
OPPO K10x

OPPO K10x

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా తమ K-సిరీస్‌‌ను అప్‌డేట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త OPPO K10x స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది K-సిరీస్ నుంచి వచ్చిన నాల్గవ మోడల్. అంతకు ముందు OPPO K10 5G, అందులోనే వైటాలిటీ ఎడిషన్‌ అలాగే OPPO K10 Pro మోడల్ ఫోన్లు లైన్‌లో ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Washing Fruits: పండ్లపై ఉన్న కనిపించని పురుగుమందులను ఇలా సులువుగా తొలగించండి, వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

Moongdal Curry: పొట్టు పెసరపప్పుతో కూర వండితే అదిరిపోతుంది, వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది

Pre Wedding Diet : పెళ్లికి ఒక వారం ముందు నివారించాల్సిన కొన్ని విషయాలు

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో మేకల కాపరి ముఖం ఎక్కడుందో తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు

ఇక, ప్రస్తుతం విడుదల చేసిన OPPO K10x స్మార్ట్‌ఫోన్‌ కూడా దాదాపు అదే తరహాలో ఫీచర్లను కలిగి ఉంది. అయితే కాన్ఫిగరేషన్, పనితీరు పరంగా మరింత మెరుగైన స్పెసిఫికేషన్లతో వచ్చింది. పనితీరు పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ Honor X40 వలె ఉంటుందని కొన్ని నివేదికలు తెలుపగా, మిగతా స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే ఇది Realme V25 5G ఫోన్‌‌కు రీబ్రాండెడ్ వెర్షన్ అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యం ఆధారంగా OPPO K10x మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే పోలార్ నైట్, అరోరా అనే రెండు కలర్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది.

ఇంకా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత? తదితర వివరాలను పరిశీలించండి.

OPPO K10x స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.59 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే
  • 8GB/12GB RAM, 128GB/256GB స్టోరేజ్ సామర్థ్యం
  • స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
  • వెనకవైపు 64MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్
  • ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 67W ఛార్జర్‌

ధరలు ఈ విధంగా ఉన్నాయి... 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం ధర 1,499 యువాన్ (సుమారు రు. 17 వేలు),

8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం ధర 1,699 యువాన్ (సుమారు రు. 19 వేలు),

12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం ధర 1,999 యువాన్ (సుమారు రు. 23 వేలు).

ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్లో సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి వస్తుంది. మిగతా మార్కెట్లలోకి ఎప్పుడొస్తుందనేది తెలియాల్సి ఉంది.

టాపిక్