తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vivo T1 5g Silky White। మిల్కీ బ్యూటీ రంగులో వివో ఫోన్‌‌లో కొత్త సిల్కీ వేరియంట్

Vivo T1 5G Silky White। మిల్కీ బ్యూటీ రంగులో వివో ఫోన్‌‌లో కొత్త సిల్కీ వేరియంట్

HT Telugu Desk HT Telugu

18 September 2022, 10:28 IST

    • వివో కంపెనీ Vivo T1 5G స్మార్ట్‌ఫోన్‌లో సిల్కీ వైట్ వేరియంట్ లాంచ్ చేసింది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏమిటి? ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
Vivo T1 5G Silky White
Vivo T1 5G Silky White

Vivo T1 5G Silky White

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తమ Vivo T1 5G స్మార్ట్‌ఫోన్‌ మోడల్ కోసం కొత్తగా సిల్కీ వైట్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇదివరకు రెయిన్‌బో ఫాంటసీ, స్టార్‌లైట్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్‌లలో లభించేంది. ఇప్పుడు అదనంగా సిల్కీవైట్ ఆప్షన్‌లోనూ అందుబాటులో ఉంటుంది. వివో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసింది. ప్రస్తుతం మూడు కలర్ ఆప్షన్లలో Vivo T1 5G ఫ్లిప్‌కార్ట్‌, అధికారిక Vivo ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

ఇక, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. Vivo T1 5G సిల్కీ వైట్ వేరియంట్ స్పెసిఫికేషన్‌లు కూడా ఇతర కలర్ వేరియంట్‌ల మాదిరిగానే ఉంటాయి. అయితే ఈ హ్యాండ్‌సెట్‌లో సూపర్ నైట్ మోడ్, మల్టీ స్టైల్ పోర్ట్రెయిట్ మోడ్ వంటి కొన్ని కెమెరా ఫీచర్‌లను చేర్చింది. Vivo T1 5Gలో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ర్యామ్ కెపాసిటీ ఆధారంగా ఈ ఫోన్ వివిధ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.

మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత? మొదలైన విషయాలను ఇప్పుడు చూద్దాం.

Vivo T1 5G Silky White స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.58 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే
  • 4GB/6GB/8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్

4 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 15,499/-

6 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 16,999/-

8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 19,999/-

కనెక్టివిటీ కోసం..ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.1, USB టైప్ C పోర్ట్, USB OTG ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం