తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oppo F21s Pro Series Price | ఒప్పో నుంచి రెండు కొత్త ఫోన్‌లు.. ధరలు అందుబాటులోనే!

Oppo F21s Pro Series Price | ఒప్పో నుంచి రెండు కొత్త ఫోన్‌లు.. ధరలు అందుబాటులోనే!

HT Telugu Desk HT Telugu

15 September 2022, 15:57 IST

    • ఒప్పో తమ F-సిరీస్‌లో Oppo F21s Pro, Oppo F21s Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వీటి ఫీచర్లు, ధర, లభ్యత, క్యాష్ బ్యాక్ ఆఫర్ల వివరాలు ఇక్కడ చూడండి.
Oppo F21s Pro series
Oppo F21s Pro series

Oppo F21s Pro series

చైనాకు చెందిన మొబైల్ తయారీదారు ఒప్పో భారత మార్కెట్లో F-సిరీస్‌ను మరింత విస్తరించింది. ఈ క్రమంలో తాజాగా Oppo F21s Pro సిరీస్‌లో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇందులో ఒకటి Oppo F21s Pro కాగా, మరొకటి Oppo F21s Pro 5G ఫోన్.

ట్రెండింగ్ వార్తలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

ఈ రెండు హ్యాండ్ సెట్లు దాదాపు ఒకే విధమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి. మొదట పేర్కొన్న మోడల్ 4G వెర్షన్, ఇందులో సెల్ఫీ కెమెరా బాగుంటుంది, అయినప్పటికీ దాని 5G వెర్షన్ కంటే ధర తక్కువగానే ఉంటుంది.

కంపెనీ ప్రకారం, ఈ Oppo F21s Pro సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు 15x అలాగే 30x మాగ్నిఫికేషన్ సామర్థ్యాలు కలిగిన సెగ్మెంట్-ఫస్ట్ మైక్రోలెన్స్‌తో వస్తుంది. ఇది యూజర్లు తమ చుట్టూ ఉన్న మైక్రోస్కోపిక్ ప్రపంచంలోని సూక్ష్మ వివరాలను పరిశీలించటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఈ కొత్త ఫోన్లలో ఒక హైలైట్‌గా చెప్పవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఏకైక స్టోరేజ్ వేరియంట్లో లభ్యమవుతాయి. అయితే డాన్‌లైట్ గోల్డ్, స్టార్‌లైట్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి.

మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్ల ను ఇక్కడ పరిశీలించండి.

Oppo F21s Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.43-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే

8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం

క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్

వెనకవైపు 64MP + 2MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W SuperVOOC ఛార్జర్

ధర రూ. 22,999/-

Oppo F21s Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.43-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే

8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం

క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్

వెనకవైపు 64MP + 2MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W SuperVOOC ఛార్జర్

ధర రూ. 25,999/-

Oppo F21s ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు సెప్టెంబర్ 19, 2022 నుండి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. Oppo స్టోర్, అమెజాన్ సహా ఇతర మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌లలో కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌ హోల్డర్లకు 10% క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం