Oppo నుంచి రెండు కొత్త ఫోన్‌లు.. ఒకటి 5G, ఇంకోటి 5G కాదు మిగతాదంతా సేమ్ టూ సేమ్!-oppo f21 pro and f21 pro 5g launched ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oppo నుంచి రెండు కొత్త ఫోన్‌లు.. ఒకటి 5g, ఇంకోటి 5g కాదు మిగతాదంతా సేమ్ టూ సేమ్!

Oppo నుంచి రెండు కొత్త ఫోన్‌లు.. ఒకటి 5G, ఇంకోటి 5G కాదు మిగతాదంతా సేమ్ టూ సేమ్!

HT Telugu Desk HT Telugu
Apr 13, 2022 05:21 PM IST

ఒప్పో నుంచి F21 ప్రో, F21 ప్రో 5G అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లోకి వచ్చేశాయి. డిజైన్ పరంగా చాలా స్టైలిష్‌గా చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఈ ఫోన్ల ఫీచర్లు, స్పెక్స్ ఎలా ఉన్నాయో చూడండి..

Opp f21 Pro & Opp f21 Pro 5G Smartphones
Opp f21 Pro & Opp f21 Pro 5G Smartphones (Oppo India)

మొబైల్ తయారీదారు సంస్థ ఒప్పో తాజాగా F21 ప్రో, F21 ప్రో 5G అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చాయి. వీటితో పాటు Enco Air 2 Pro TWS ఇయర్‌బడ్స్‌ను కూడా ఒప్పో లాంచ్ చేసింది. 

ఒప్పో అధికార వెబ్‌సైట్‌, ఇతర ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లతో పాటు మొబైల్ స్టోర్లలో కూడా తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నట్లు కంపెనీ తెలిపింది.

రెయిన్బో స్పెక్ట్రమ్, కాస్మిక్ బ్లాక్, సన్‌సెట్ ఆరెంజ్ అనే మూడు రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ రెండు ఫోన్లను పరిశీలిస్తే ఒకటి 4G కాగా, మరొకటి 5G. అంతే తేడా.  మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ గమనించండి..

Oppo F21 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లే

8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం

క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్

వెనకవైపు 64 మెగా పిక్సెల్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జర్

ధర రూ. 22,999/-

Oppo F21 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లే

8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం

క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్

వెనకవైపు 64 మెగా పిక్సెల్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జర్

ధర రూ. 26,999/-

Oppo Enco Air2 Pro ధర రూ. 3,499

Oppo F21 Pro ఫోన్ ఏప్రిల్ 15 నుండి కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తుండగా, Oppo F21 Pro 5Gని ఏప్రిల్ 21 నుంచి వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్