Vivo Y22 । తక్కువ ధరకే స్టైలిష్ స్మార్ట్‌ఫోన్.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా!
13 September 2022, 21:49 IST
- Vivo Y22 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. ఇది బడ్జెట్ ధరలోనే లభించే ఫోన్, HDFC కార్డ్ హోల్డర్లకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. వివరాలు చూడండి.
Vivo Y22
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తాజాగా Vivo Y22 పేరుతో మరొక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది బడ్జెట్ ధరలోనే లభించే స్మార్ట్‌ఫోన్. అయినప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన్‌లో HD+ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే, 128GB వరకు అంతర్గత నిల్వతో వచ్చింది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ విస్తరించుకోవచ్చు.
స్టోరేజ్ ఆధారంగా ఈ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 4GB RAM + 64GB అంతర్నిర్మిత నిల్వతో కూడిన వేరియంట్‌కు ధర రూ, 14,499/- గా నిర్ణయించారు. 6GB RAM+ 128GB స్టోరేజ్ కలిగిన మరో వేరియంట్ కూడా లభ్యమవుతోంది. అయితే ఇంకా ఇది లాంచ్ కాలేదు, త్వరలో లాంచ్ ఉండనుంది.
వివో కంపెనీ ఇదే Vivo Y22 స్మార్ట్‌ఫోన్‌ను కొద్దిరోజుల కిందట ఇండోనేషియన్ మార్కెట్లో విడుదల చేసింది. అయితే దాని ధరతో పోల్చితే ఇండియాలో విడుదల చేసిన హ్యాండ్‌సెట్ ధర సుమారు రూ. 1500 ఎక్కువగా ఉంది. కానీ ఫీచర్లు అన్నీ దాదాపు సమానంగానే ఉన్నాయి.
అయితే HDFC క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ.750 తగ్గింపును అందిస్తున్నారు. SBI, Kotak కార్డ్ హోల్డర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. Vivo Y22లోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇక్కడ తెలుసుకోండి.
Vivo Y22 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 6.55-అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే
- 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+ 2MP డ్యుఎల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్
కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.0, NFC, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS), FM రేడియో, OTG సపోర్ట్ ఉన్నాయి.
ఈ ఫోన్ స్టార్‌లైట్ బ్లూ, మెటావర్స్ గ్రీన్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వివో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
అలాగే వివో కంపెనీ తమ Vivo T1 5Gని సరికొత్త సిల్కీ వైట్ కలర్ ఆప్షన్‌లో కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్స్ 2022లో కొనుగోలు చేయవచ్చు.