తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oppo A57e । రూ. 10 వేల బడ్జెట్ ధరకే ఒప్పో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్లు ఇవీ!

Oppo A57e । రూ. 10 వేల బడ్జెట్ ధరకే ఒప్పో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్లు ఇవీ!

HT Telugu Desk HT Telugu

01 September 2022, 15:59 IST

    • ఒప్పో నుంచి సరికొత్త Oppo A57e స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదల అయింది. ఇది రూ. 10 బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. దీని వివరాలు..
Oppo A57e
Oppo A57e

Oppo A57e

స్మార్ట్‌ఫోన్‌ మేకర్ ఒప్పో భారత మార్కెట్లో నిశబ్దంగా Oppo A57e అనే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన Oppo A57 కు అప్‌డేటెడ్ వెర్షన్ అయినప్పటికీ, అదే ధరతో విడుదల చేసింది. ఇంకా ఆసక్తికర విషయమేమిటంటే Oppo A57e స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లను మరింత తగ్గించి, ఇంకా తక్కువ ధరకు ఇందులోనే రెండవ వేరియంట్ కూడా విడుదల చేసింది. ఇది రూ. 10 వేల బడ్జెట్ ధరకే లభించనుంది. ఇదిలా ఉంటే, ఒప్పో కంపెనీ ఈ వారంలో యురోపియన్ దేశాలలో Oppo A57s అనే వేరియంట్ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వేరియంట్ కూడా సమానమైన ఫీచర్లు, ధరను కలిగి ఉంది. దీనిని కూడా ఒప్పో భారత మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తుంది, అయితే ఎప్పుడనేది మాత్రం అస్పష్టంగా ఉంది. ఏది ఏమయినప్పటికీ ఒకేరకమైన ఫీచర్లతో వివిధ రకాల వేరియంట్లను ఒప్పో మార్కెట్ చేయడం గమనార్హం.

ఇక సరికొత్త Oppo A57e స్మార్ట్‌ఫోన్‌ గురించి మాట్లాడుకుంటే.. ఇది రెండు స్టోరేజ్ అధారంగా వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 2GB RAM +16GB స్టోరేజ్ స్పేస్ వేరియంట్ ధర రూ. 9,990/- కాగా, 4GB RAM+ 64GB స్టోరేజ్ స్పేస్ ఉన్న వేరియంట్ ధర రూ.13,999/-

ఇంకా Oppo A57లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ క్రింద పేర్కొన్నాము.

Oppo A57e స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.56-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
  • 2GB/ 4GB RAM, 16GB/ 64 GB స్టోరేజ్ సామర్థ్యం (1TB స్టోరేజ్ వరకు విస్తరించవచ్చు)
  • మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్
  • వెనకవైపు 13MP+ 2MP డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్

ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, రెడ్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంకా ఫోన్‌లో 4G, Wi-Fi, బ్లూటూత్ v5.2, USB టైప్-సి పోర్ట్ 3.5mm జాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ , ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ ఉన్నాయి.

ఇది భారత మార్కెట్లో Poco M2, Realme Narzo 30A, Xiaomi Redmi 9 అలాగే Vivo Y15c వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం