Poco C40 | పోకో ఫోన్‌లలోనే అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్‌ ఇదే!-poco c40 is the most affordable poco phone know price and features ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Poco C40 | పోకో ఫోన్‌లలోనే అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్‌ ఇదే!

Poco C40 | పోకో ఫోన్‌లలోనే అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్‌ ఇదే!

HT Telugu Desk HT Telugu
Jun 19, 2022 11:55 AM IST

పోకో కంపెనీ తాజాగా మార్కెట్లో Poco C40 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌. మరి ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత మొదలగు వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Poco C40
Poco C40

స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు షావోమి నుంచి వేరుపడిన సబ్ బ్రాండ్ పోకో తాజాగా Poco C40 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఒక ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌, అయినప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని ప్రీమియం ఫీచర్లను అందించారు. ముఖ్యంగా ఇందులో 6,000mAh సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీ ఉంది. ఇందులో సరికొత్త JLQ చిప్‌సెట్‌ను ఇచ్చారు. ఇప్పటివరకు ఇలాంటి ప్రాసెసర్ తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ రాలేదు, ఇప్పుడు ఇదే మొదటిది అవుతుంది.

Poco C40 విభిన్నమైన డిజైన్‌లో వస్తుంది. Poco అందించే చాలా ఫోన్‌లలో ఇదే రకమైన డిజైన్‌ను కొనసాగిస్తున్నారు. హ్యాండ్ సెట్ ముందుభాగంలో వాటర్-డ్రాప్ ప్యానెల్ అలాగే వెనుకవైపు అడ్డంగా సాగదీసిన కెమెరా ఐలాండ్ డిజైన్‌ ఇచ్చారు. దీని డిస్‌ప్లే 1650 x 720 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌తో ఇచ్చారు, ఇది గొరిల్లా గ్లాస్ రక్షణను కలిగి ఉంది.

ఇంకా ఇందులో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత? తదితర వివరాలను ఇక్కడ పరిశీలించండి..

Poco C40 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.71 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
  • 4 GB RAM, 64 GB స్టోరేజ్ సామర్థ్యం
  • JLQ JR510  ప్రాసెసర్
  • వెనకవైపు 13 MP + 2MP డ్యుఎల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 6000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఫాస్ట్ ఛార్జర్

కనెక్టివిటీ పరంగా డ్యూయల్-బ్యాండ్, Wi-Fi డైరెక్ట్, బ్లూటూత్ 5.0, A-GPS, ఇన్‌ఫ్రారెడ్ పోర్ట్, USB టైప్-C 2.0, USB ఆన్-ది-గో, వెనుక మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌ పవర్ బ్లాక్, కోరల్ గ్రీన్,  Poco యెల్లో షేడ్ అనే మూడు కలర్ ఛాయిస్‌లలో లభించనుంది.  పోకో ఫోన్లు అన్నింటిలో Poco C40 సరసమైనది అని కంపెనీ పేర్కొంది అయినప్పటికీ దీని ధర ఎంత అనేది వెల్లడించలేదు. సుమారు రూ. 11,500 వరకు ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్