Vivo Y15c | వివో నుంచి మరో ఎంట్రీలెవెల్ 4G స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు ఇలా ఉన్నాయి!
మొబైల్ తయారీదారు తాజాగా మరో ఎంట్రీలెవెల్ 4G స్మార్ట్‌ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత ఉండొచ్చు మొదలగు వివరాలు ఇక్కడ చూడండి..
మొబైల్ తయారీదారు వివో తమ బ్రాండ్ నుంచి Y-సిరీస్‌లో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y15c ను భారత మార్కెట్లో విడుదల చేసింది. చడీచప్పుడు లేకుండా Vivo Y15c స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ తమ ఇండియా వెబ్‌సైట్‌లో జాబితా చేసింది. Vivo Y15c అనేది ఎంట్రీ-లెవల్ 4G మొబైల్. ఇది గతంలో వచ్చిన Vivo Y15sను పోలి ఉంది. అయినప్పటికీ దీని ఫీచర్లు కొత్తగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది, మీడియాటెక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్లూ కలర్ లోనే రెండు షేడ్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది.
ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Vivo Y15c స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.51 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే
3GB RAM, 32/64GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
మీడియాటెక్ Helio P35 ప్రాసెసర్
వెనకవైపు 13+2 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్
ఇంకా నిర్ణయించలేదు. రూ, 15 వేల లోపే ఉండొచ్చని అంచనా.
కనెక్టివిటీ పరంగా చూస్తే Vivo Y15cలో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, ఇంకా 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.
సంబంధిత కథనం