Realme Narzo సిరీస్‌లో రెండు సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదల!-realme narzo 50 pro 5g smartphone launched ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Realme Narzo సిరీస్‌లో రెండు సరికొత్త 5g స్మార్ట్‌ఫోన్‌లు విడుదల!

Realme Narzo సిరీస్‌లో రెండు సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదల!

HT Telugu Desk HT Telugu
May 18, 2022 10:50 PM IST

రియల్‌మి కంపెనీ Realme Narzo 50 అలాగే Realme Narzo 50 Pro అనే 5G స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వాటి వివరాలు

Realme Narzo 50
Realme Narzo 50

మొబైల్ తయారీదారు Realme తాజాగా తమ Narzo సిరీస్‌లో మరో రెండు సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లకు చోటు కల్పించింది. Realme Narzo 50, మరొక మోడల్ Realme Narzo 50 Pro స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో విడుదలయ్యాయి.ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని ఇందులో ఫీచర్లు పొందుపరిచినట్లు కంపెనీ తెలిపింది. మే 24, మధ్యాహ్నం 12:00 గంటల నుంచి realme.com, Amazon ఇతర ముఖ్యమైన స్టోర్లలో వీటి సేల్స్ ప్రారంభమవుతాయని తెలిపింది. 

ఈ రెండు ఫోన్లతో పాటు Realme TechLife Watch SZ100 అనే స్మార్ట్‌వాచ్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. ఇందులో పెద్ద కలర్ డిస్‌ప్లే, 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

ఇకపోతే తాజాగా విడుదలైన రెండు ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. వీటి ధరలు ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Realme Narzo 50 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.4 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే

6GB/8GB RAM, 128 GB స్టోరేజ్ సామర్థ్యం

ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్

వెనకవైపు 48 MP ప్రైమరీ సెన్సార్, 8 MP అల్ట్రా-వైడ్ షూటర్, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ

6 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 21,999/- కాగా, 8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 23,999/- గా నిర్ణయించారు.

Realme Narzo 50 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే

4GB/6GB RAM,  64GB/128 GB స్టోరేజ్ సామర్థ్యం

ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్

వెనకవైపు 48 MP +2 MP కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ

4 GB RAM, 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 15,999/- 

4 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 16,999/-

6 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 17,999/- గా నిర్ణయించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్