తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lenovo Legion Y70 | లెజియన్ సిరీస్‌లో లెనొవో తొలి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌!

Lenovo Legion Y70 | లెజియన్ సిరీస్‌లో లెనొవో తొలి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

21 August 2022, 10:33 IST

    • లెనొవొ కంపెనీ నుంచి మొదటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ Lenovo Legion Y70 విడుదలైంది. ఇది గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫోన్. దీని ఫీచర్స్, ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూడండి.
Lenovo Legion Y70
Lenovo Legion Y70

Lenovo Legion Y70

పీసీ మేకర్ లెనొవొ తమ లెజియన్ గేమింగ్ సిరీస్‌లో వరుసగా సరికొత్త హ్యాండ్ సెట్లను ప్రవేశపెడుతుంది. తాజాగా Lenovo Legion Y70 పేరుతో ఒక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌తో వచ్చిన మొదటి Lenovo స్మార్ట్‌ఫోన్ ఇదే కావటం గమనార్హం. సరళమైన డిజైన్, అగ్రశ్రేణి పనితీరును కనబరిచే విధంగా లెనొవొ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. Legion Y70 కేవలం 7.9mm మందంగా ఉంటుంది. దీని బాడీ ఏవియేషన్-గ్రేడ్ అల్యూమినియం, CNC-క్రేవ్డ్ మెటల్ ఫ్రేమ్‌తో బిలడ్ అయి ఉంది. ఇది టైటానియం గ్రే, ఐస్ వైట్, బ్లేజ్ రెడ్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది.

ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా Lenovo Legion Y70 మూడు కాన్ఫిగరేషన్లలో వస్తోంది. దీని టాప్-స్పెక్ మోడల్ 16GB/512GB వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

Legion Y70 గేమింగ్ ఫ్యామిలీలో భాగం కావడం ఈ స్మార్ట్‌ఫోన్‌ కోసం కొన్ని ప్రత్యేకమైన యాక్సెసరీలు కూడా లభిస్తాయి. ఇందులో భాగంగా Lenovo కూలింగ్ కెపాసిటర్స్, Asus ఏరోయాక్టివ్ ఉత్పత్తికి సమానమైన ఎయిర్ కూలర్, అటాచ్ చేయదగిన షోల్డర్ ట్రిగ్గర్‌లతో ప్రొటెక్టివ్ కేస్‌ వంటివి ఉన్నాయి.

ఇంకా సరికొత్త Lenovo Legion Y70 స్మార్ట్‌ఫోన్‌లో మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏమున్నాయి? ధర ఎంత? తదితర వివరాలు ఈ కింద పరిశీలించండి.

Lenovo Legion Y70 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన, 6.67-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే
  • 8GB/12GB/12GB RAM, 128GB/256GB/512 GB స్టోరేజ్ సామర్థ్యం
  • స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+13MP+2MP ట్రిపుల్ కెమెరా సెట్, ముందు భాగంలో 16MP సెల్ఫీ స్నాపర్
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5100 mAh బ్యాటరీ సామర్థ్యం, 68W ఛార్జింగ్

బేసిక్ మోడల్ 8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,970 (సుమారు రూ. 35,000)

బేసిక్ మోడల్ 12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,370 (సుమారు రూ. 40,000)

బేసిక్ మోడల్ 16GB RAM+512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,270 (సుమారు రూ. 50,000)

Lenovo Legion Y70 ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది, మిగతా దేశాల మార్కెట్లలో విడుదలయ్యే సమాచారంపై స్పష్టత లేదు.

టాపిక్