Lenovo Smart Clock Essential । లెనొవొ స్మార్ట్ క్లాక్.. ఇది చాలా స్మార్ట్ గురూ!-lenovo smart clock essential launched know features and price ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lenovo Smart Clock Essential । లెనొవొ స్మార్ట్ క్లాక్.. ఇది చాలా స్మార్ట్ గురూ!

Lenovo Smart Clock Essential । లెనొవొ స్మార్ట్ క్లాక్.. ఇది చాలా స్మార్ట్ గురూ!

HT Telugu Desk HT Telugu
Jun 16, 2022 03:42 PM IST

లెనొవొ కంపెనీ ఒక స్మార్ట్ క్లాక్ ను విడుదల చేసింది. ఇది కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే కాకుండా సమయాన్ని ఆదా చేసుకునేలా ఎన్నో 'స్మార్ట్' పనులను చేస్తుంది. వివరాలు చూడండి.

<p>Lenovo Smart Clock Essential</p>
Lenovo Smart Clock Essential

లెనొవొ కంపెనీ స్మార్ట్ హోం సొల్యూషన్‌లో భాగంగా సరికొత్తగా Lenovo స్మార్ట్ క్లాక్ ఎసెన్షియల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ క్లాక్‌లో అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ను ఇన్-బిల్ట్‌గా ఇచ్చారు. మెరుగైన ఆడియో రీచ్ కోసం ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్‌లను ఇచ్చారు. అంతేకాకుండా ఇందులో మొత్తం సమాచారాన్ని దీనికి ఉన్న LED డిస్‌ప్లేలో చూడవచ్చు. 

ఈ స్మార్ట్ క్లాక్ బరువు 250 గ్రాములు. దీనిని సాఫ్ట్-టచ్ ఫాబ్రిక్‌తో తయారుచేశారు. ఇది ఆకర్షణీయమైన ఎరుపు, నీలం రంగుల్లో ఇది లభిస్తుంది. దీనిని మీ డెస్క్ లేదా టెబుల్ మీద అలంకరణగా వస్తువులా కూడా పెట్టుకోవచ్చు. ఎవరికైనా బహుమతిగా కూడా ఇవ్వటానికి బాగుంటుంది.

ఇది కేవలం సమయాన్ని తెలిపే, అలారం సెట్ చేసుకునే గడియారం కాదు. ఈ Smart Clock Essential అనేది మార్కెట్‌లో ఉన్న Google Nest Hub గాడ్జెట్ లాగా పనిచేస్తుంది. దీని ద్వారా వాతావరణ సూచనలు తెలుసుకోవచ్చు. బయట ఉష్ణోగ్రత వివరాలు, పాటలు వినడం, షాపింగ్ చేయడం ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే దీని ధర మాత్రం గూగుల్ పరికరం కంటే చాలా తక్కువగానే ఉంటుంది. ఇంకా ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

లెనొవొ స్మార్ట్ క్లాక్ ఎసెన్షియల్ ఫీచర్లు

Lenovo Smart Clock Essential 4-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీకు వాతావరణ అప్ డేట్ లను అందిస్తుంది.  Amazon Prime Music, Spotify వంటి ప్లాట్‌ఫారమ్‌లకు కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ ప్లే చేయవచ్చు. రెండు Alexa-సెంట్రిక్ పరికరాల మధ్య హ్యాండ్స్-ఫ్రీ కాల్‌లను కూడా చేసుకోవచ్చు. ఇది మీరు ఇంట్లోని అన్ని స్మార్ట్ పరికరాలను కంట్రోల్ చేయడానికి స్మార్ట్ కేంద్రంగా ఉపయోగించవచ్చు. అన్ని యాప్‌లను యాక్సెస్ చేయటానికి ఇందులో 4GB RAM, 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.  Alexa హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ సపోర్ట్‌ని కలిగి ఉంది కాబట్టి, మీరు కేవలం వాయిస్ కమాండ్‌ని ఇచ్చి వివిధ పనులను పూర్తి చేయవచ్చు. ఇందులోని స్మార్ట్ స్పీకర్‌ను 1.5-అంగుళాల 3W ఫ్రంట్-ఫైరింగ్ ఆడియో యూనిట్‌తో ఇచ్చారు. దూరం నుంచి కూడా స్పష్టమైన ఆడియో రిసీచ్ చేసుకునేలా 2 ఫార్-ఫీల్డ్ మైక్రోఫోన్‌లను అమర్చారు. వాల్యూమ్ నియంత్రణ కోసం కంట్రోల్ బటన్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఇది Wi-Fi, బ్లూటూత్‌కు సపోర్ట్ చేస్తుంది.

లెనొవొ స్మార్ట్ క్లాక్ ఎసెన్షియల్ ధర రూ. 4,999/- దీనిని ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం