తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lenovo Tab P12 Pro | డాల్బీ విజన్‌తో ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్, ధర కూడా ఎక్కువే!

Lenovo Tab P12 Pro | డాల్బీ విజన్‌తో ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్, ధర కూడా ఎక్కువే!

HT Telugu Desk HT Telugu

09 June 2022, 15:29 IST

    • లెనొవొ కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఫీచర్‌లతో  ఒక ఖరీదైన టాబ్లెట్ ఫోన్‌ Lenovo Tab P12 Proను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..
Lenovo Tab P12 Pro
Lenovo Tab P12 Pro

Lenovo Tab P12 Pro

ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్లను ఉత్పత్తి చేసే ప్రముఖ చైనీస్ కంపెనీ లెనొవొ తాజాగా Lenovo Tab P12 Pro అనే ఆండ్రాయిడ్ టాబ్లెట్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త Lenovo Tab P12 Pro టాబ్లెట్ ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఫీచర్‌లతో వచ్చింది. దీని ద్వారా లెనొవొ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే పాపులర్ టాబ్లెట్‌ మోడల్స్ అయిన శాంసగ్ గెలాక్సీ Tab S-series అలాగే షావోమి Pad 5 వంటి వాటికి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా దేశంలో వివిధ రకాల ఐప్యాడ్‌లను విడుదల చేస్తున్న ఆపిల్‌కు గట్టి పోటీని ఇవ్వాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

లెనొవొ నుంచి విడుదలైన ఈ ప్రీమియం టాబ్లెట్‌లో డాల్బీ విజన్‌ను అందించే AMOLED డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది శక్తివంతమైన Qualcomm Snapdragon చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. అంతేకాకుండా ఈ టాబ్లెట్‌తో వినియోగదారులకు Lenovo Precision Pen 3 అనే స్టైలస్‌ను అందిస్తున్నారు. ఈ స్టైలస్ టాబ్లెట్‌తో దానంతటదే పెయిర్ చేసుకుంటుంది. లేటెన్సీ రేట్ కూడా తక్కువ ఉంటుంది. అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ప్రస్తుతం చైనాలో లాంచ్ చేసిన ఈ టాబ్లెట్ త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా Lenovo Tab P12 Proకి సంబంధించి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏమున్నాయి? ధరలు ఎంత? తదితర వివరాలు ఈ క్రింద తెలుసుకోండి. .

Lenovo Tab P12 Pro టాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగిన 12.6-అంగుళాల AMOLED డిస్‌ప్లే
  • 8 GB RAM, 256 GB స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్
  • వెనకవైపు 13MP + 5MP కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 10200 mAh బ్యాటరీ సామర్థ్యం, 45W ఛార్జింగ్
  • ధర, రూ. 69,999/-

Lenovo Tab P12 Pro ఇప్పుడు లెనొవొ అధికారిక వెబ్ సైట్ Lenovo.com, ఈ-కామర్స్ భాగస్వామి Amazon.in అలాగే Lenovo ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం