తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  దృఢమైన బ్యాటరీతో Realme Pad Mini టాబ్లెట్ ఆవిష్కరణ!

దృఢమైన బ్యాటరీతో Realme Pad Mini టాబ్లెట్ ఆవిష్కరణ!

HT Telugu Desk HT Telugu

05 April 2022, 16:17 IST

google News
    • రియల్‌మి నుంచి మరో టాబ్లెట్ ఫోన్ విడుదలయింది. Realme Pad Mini పేరుతో వస్తున్న ఈ టాబ్లెట్లో మంచి బ్యాటరీ బ్యాకప్ తో పాటు స్క్రీన్ రెసల్యూషన్ అలాగే స్పీకర్లు బాగున్నాయి. మిగతా వివరాలు ఇలా ఉన్నాయి..
Realme Pad Mini
Realme Pad Mini

Realme Pad Mini

కొన్ని వారాలుగా వస్తున్న ఊహగానాలను నిజం చేస్తూ Realme ఎట్టకేలకు Realme Pad Miniని ఆవిష్కరించింది. ఈ టాబ్లెట్ గతంలో వచ్చిన రియల్‌మి ప్యాడ్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్. స్మార్ట్‌ఫోన్ పరిమాణాన్ని మరింత పెంచుతూ, ల్యాట్‌టాప్‌ల కంటే తక్కువ పరిమాణంలో మధ్యస్థంగా ఉండే ఈ టాబ్లెట్లు అధికార కార్యకలాపాలకు, విద్యార్థులకు e- లర్నింగ్ కోసం అనువుగా ఉంటాయి. 

ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లో లాంచ్ చేసిన ఈ టాబ్లెట్ త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో Realme Pad Miniకి సంబంధించి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి? ధరలు ఏ మేరకు ఉండొచ్చో ఇక్కడ చూడండి.

Realme Pad Mini టాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

8.7-అంగుళాల LCD డిస్‌ప్లే, 1340×800 పిక్సెల్స్ రిజల్యూషన్‌

3GB/4GB RAM, 64 GB స్టోరేజ్ సామర్థ్యం 

Unisoc T616 ప్రాసెసర్

వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

6400mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఫాస్ట్ ఛార్జింగ్

ధర రూ. 14 వేల నుంచి రూ.18 వేల వరకు

మిగతా స్పెక్స్ చూస్తే.. కనెక్టివిటీలో Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, 4G సపోర్ట్, USB-C పోర్ట్ , 3.5mm ఆడియో కాంబో జాక్ సహా డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. గ్రే, బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం