Realme Pad X । సెన్సిటివ్ స్టైలస్‌తో రియల్‌మి నుంచి తొలి ప్రీమియం టాబ్లెట్!
30 May 2022, 11:57 IST
- రియల్‌మి నుంచి మరో టాబ్లెట్ ఫోన్ విడుదలయింది. Realme Pad X పేరుతో ఈ హ్యాండ్‌సెట్ Realme కంపెనీ నుంచి వస్తున్న మొట్టమొదటి ప్రీమియం టాబ్లెట్ ఫోన్. మిగతా వివరాలు ఇలా ఉన్నాయి..
Realme Pad X
మొబైల్ తయారీదారు రియల్‌మి తాజాగా 'Realme Pad X' పేరుతో మరొక సరికొత్త టాబ్లెట్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. Realme Pad X అనేది కంపెనీ నుంచి వచ్చే మొట్టమొదటి ప్రీమియం టాబ్లెట్. ఇది ఇటీవల లాంచ్ అయిన Xiaomi Pad 5 కంటే కూడా మెరుగైనది. అయితే ఈ సరికొత్త Realme Pad X టాబ్లెట్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న Samsung Galaxy Tab S8 వంటి హై-ఎండ్ టాబ్లెట్ తో మాత్ర పోటీ పడలేదు. కాకపోతే Realme లాంచ్ చేసిన అన్నింటి కంటే శక్తివంతమైనది అని చెప్పవచ్చు.
ప్రస్తుతం చైనాలో లాంచ్ చేసిన ఈ టాబ్లెట్ త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో Realme Pad Xకి సంబంధించి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి? ధరలు ఏ మేరకు ఉండొచ్చో ఇక్కడ చూడండి.
Realme Pad X టాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 11-అంగుళాల LCD డిస్‌ప్లే, 2K రిజల్యూషన్
- 4GB/ 6GB RAM, 128 GB స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
- వెనకవైపు 13 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 105 డిగ్రీల వీక్షణనిచ్చే 8MP కెమెరా
- ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
- 8340mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జింగ్
- ధర రూ. 14 వేల నుంచి రూ.18 వేల వరకు
ఈ టాబ్లెట్ వైఫై వెర్షన్‌లో మాత్రమే వస్తుంది. Realme UI 3.0 ఆధారంగా ప్యాడ్ పనితీరు కనబరుస్తుంది. స్క్రీన్ పై ఒత్తిడి తగ్గించేలా సెన్సిటివ్ స్టైలస్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. Realme Pad X స్టార్ గ్రే, సీ సాల్ట్ బ్లూ, బ్రైట్ చెస్‌బోర్డ్ గ్రీన్ గ్రే, బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.