Oppo A57s। సరసమైన ధరలో వచ్చిన సరికొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్‌, దీని ఫీచర్లు ఇవిగో!-oppo a57s smartphone launched as budget range offer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oppo A57s। సరసమైన ధరలో వచ్చిన సరికొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్‌, దీని ఫీచర్లు ఇవిగో!

Oppo A57s। సరసమైన ధరలో వచ్చిన సరికొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్‌, దీని ఫీచర్లు ఇవిగో!

HT Telugu Desk HT Telugu
Aug 30, 2022 10:59 PM IST

ఒప్పో నుంచి సరసమైన ధరలో సరికొత్త Oppo A57s స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. దీని ధర ఎంత, ఫీచర్లేమున్నాయి మొదలైన వివరాలు ఇక్కడ చూడండి.

Oppo A57s
Oppo A57s

చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ మేకర్ ఒప్పో తమ బ్రాండ్ నుంచి సరికొత్త Oppo A57s స్మార్ట్‌ఫోన్‌ను యురోపియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో భారత మార్కెట్లోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది తమ A-సిరీస్‌ నుంచి కొంతకాలం క్రితం విడుదలైన Oppo A57 అనే స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ గా ఉంటుంది. లాంచింగ్ సమయంలో దీని ధర రూ. 13,999/-. అయితే తాజాగా విడుదల చేసిన Oppo A57s ధరను కంపెనీకి ఇప్పటికీ వెల్లడించకపోవటం గమనార్హం. ఒప్పో తమ కొత్త మోడల్ Oppo A57s ఫోన్‌ను క్రొయేషియన్ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ చేసింది. అయితే ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్‌ కూడా ఇంచుమించు దాని పాత వెర్షన్ ధరకే లభించనుంది. సుమారు రూ. 16 వేలుగా ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఏదేమైనా Oppo A57s స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇప్పుడు బహిర్గతం అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్లో టియర్‌డ్రాప్ నాచ్‌తో డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటివి చెప్పుకోదగ్గ అంశాలుగా ఉన్నాయి.

సరికొత్త Oppo A57sలో మరిన్ని ఫీచర్లు ఏమున్నాయో ఒక లుక్ వేయండి.

Oppo A57s స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.56-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
  • 4 GB RAM, 64+ GB స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+ 2MP డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్

కనెక్టివిటీ పరంగా డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4G VoLTE, బ్లూటూత్ 5.3, 5GHz Wi-Fi , 3.5mm ఆడియో జాక్, స్టీరియో స్పీకర్లు, సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ఉన్నాయి.

WhatsApp channel

టాపిక్