Oppo A57 । సరసమైన ధరలో సొగసైన స్మార్ట్‌ఫోన్‌!-oppo a57 affordable smartphone launched check price and offer details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oppo A57 । సరసమైన ధరలో సొగసైన స్మార్ట్‌ఫోన్‌!

Oppo A57 । సరసమైన ధరలో సొగసైన స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu
Jun 21, 2022 07:45 PM IST

ఒప్పో కంపెనీ Oppo A57 పేరుతో మరొక స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ ఆపైన బ్యాంక్ ఆఫర్లతో రూ. 1500 వరకు డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. మరిన్ని వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.

Oppo A57
Oppo A57

స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో తమ A-సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లలో మరొక స్మార్ట్‌ఫోన్‌ను చేర్చింది. Oppo A57 అనే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది.

ఈ ఫోన్‌లో దృఢమైన బ్యాటరీతో పాటు వేగవంతమైన ఛార్జింగ్ 3W SuperVOOC ఛార్జింగ్ టెక్నాలజీని అందించారు. దీంతో కేవలం కేవలం 30 నిమిషాల ఛార్జ్‌లో 50 శాతం బ్యాటరీ బ్యాకప్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఇందులో ఇచ్చిన ప్రీమియం అల్ట్రా-లీనియర్ స్టీరియో స్పీకర్ల ద్వారా నాణ్యమైన స్టీరియో సౌండ్‌ను ఆస్వాదించవచ్చు. అలాగే మల్టీటాస్కింగ్ కూడా సున్నితంగా జరుగుతుంది. ర్యామ్ సామర్థ్యాని విస్తరించుకోవచ్చు.

Oppo A57 కేవలం 7.99mm మందంతో సొగసైన డిజైన్‌ని కలిగి ఉంది. Oppo A57 కేవలం 7.99mm మందంతో సొగసైన డిజైన్‌ని కలిగి ఉంది. ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంది. నీటి నిరోధకత కోసం IPX4, ధూళి నిరోధకత కోసం IP5X రేటింగ్స్ కలిగి ఉంది. కాన్ఫిగరేషన్ పరంగా ఈ ఫోన్ ఒకే వేరియంట్లో లభ్యమవుతుంది. ఇంకా Oppo A57లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ క్రింద పేర్కొన్నాము.

Oppo A57 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.56-అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే
  • 4 GB RAM,  64 GB స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G37 ప్రాసెసర్
  • వెనకవైపు 13 మెగా పిక్సెల్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W SuperVOOC ఛార్జర్

కనెక్టివిటీ పరంగా 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ ఉన్నాయి.

ఈ ఫోన్ గ్రీన్ , గ్లోయింగ్ బ్లాక్ అనే రెండు కలర్స్ లో లభ్యమవుతోంది. ధర రూ. 13,999/-

 వినియోగదారులు Oppo అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ ద్వారా OPPO A57 కొనుగోలుపై కంపెనీ 10 శాతం తగ్గింపు (రూ. 1,500 వరకు) అందిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్