తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nothing Phone: మెుబైల్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్..పెరిగిన నథింగ్ ఫోన్ ధర.. ఎంతంటే?

nothing phone: మెుబైల్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్..పెరిగిన నథింగ్ ఫోన్ ధర.. ఎంతంటే?

HT Telugu Desk HT Telugu

19 August 2022, 20:31 IST

    • Nothing Phone 1 price: నెల రోజుల క్రితం భారత మార్కెట్లో  విడుదలైన స్మార్ట్‌ఫోన్ సంచలనం నథింగ్ ఫోన్ (1) ధర పెరిగింది.  మూడు స్టోరేజ్ వేరియంట్‌ల ధర రూ.1,000.లు పెంచారు.
nothing phone
nothing phone

nothing phone

స్మార్ట్‌ఫోన్ సంచలనం నథింగ్ ఫోన్ (1)కి భారతదేశంలో మెుదట మిశ్రమ స్పందన లభించగా.. క్రమంగా ఈ ఫోన్‌కు డిమాండ్ పెరుగుతుంది. తాజాగా ఫోన్ అమ్మకాలు పెరిగాయి. డిమాండ్ దృష్ట్యా నథింగ్ ఫోన్ (1) ధరను కూడా పెంచారు. ఈ మేరకు నథింగ్ కంపెనీ ఇండియా జనరల్ మేనేజర్ మను శర్మ ప్రకటన జారీ చేశారు. విడుదల చేసిన మూడు స్టోరేజ్ వేరియంట్‌ల ధర రూ .1,000లు పెంచారు . హఠాత్తుగా పెరిగిన ధర ఈ డియాండ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. పెంచిన ధరల ప్రకారం, భారతదేశంలో నథింగ్ ఫోన్ (1) 8GB RAM + 128GB స్టోరెజ్ ఆప్షన్ ధర రూ . 33,999గా ఉంది. 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ . 36,999గా ఉండగా 12GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ . 39,999 ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Korrala Pongali: బ్రేక్ ఫాస్ట్‌లో కొర్రల పొంగలి వండుకోండి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అల్పాహారం

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Buttermilk : వేసవిలో మజ్జిగను ఇలా చేసి తాగితే చర్మం, జుట్టుకు చాలా మంచిది

Iskon khichdi Recipe : కొత్తగా ట్రై చేయండి.. ఇస్కాన్ కిచిడీ రెసిపీ.. చాలా టేస్టీ

ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది . ఈ డిస్ప్లే 1,080 x 2,400 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సామర్థ్యం కలిగి ఉంటుంది . ఇది శక్తివంతమైన Qualcomm Snapdragon 778G+ SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది . ఇది ఆండ్రాయిడ్ 12 సపోర్ట్‌తో పని చేస్తుంది .

నథింగ్ ఫోన్ (1) డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది . మొదటి కెమెరాలో 50 మెగా పిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ ఉంది . ఇది EIS ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు OISతో వస్తుంది . ఈ ఫోన్‌లోని రెండవ కెమెరా 50 మెగా పిక్సెల్ Samsung JN1 సెన్సార్‌ను కలిగి ఉంది . ఇది EIS ఇమేజ్ స్టెబిలైజేషన్ , 114- డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ , మాక్రో మోడ్‌ను కలిగి ఉంటుంది . అలాగే 16 మెగా పిక్సెల్ సోనీ IMX471తో సెన్సార్ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది 4500mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది . 33W వైర్డ్ ఛార్జింగ్ , 15W Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది . అయితే ,ఈ ఫోన్‌ ఛార్జర్‌ లేకుండానే వస్తుంది. టైప్-సి ఛార్జింగ్ కేబుల్ మాత్రమే అందించబడుతుంది.