Motorola Revou2 TVs । కేవలం రూ. 11 వేలకే మోటోరోలా స్మార్ట్ టీవీలు... అదిరాయి ఫీచర్లు!
26 September 2022, 9:44 IST
- స్మార్ట్ ఫోన్లకు ప్రసిద్ధి చెందిన మోటోరోలా కంపెనీ భారత మార్కెట్లో Motorola Revou2 TV పేరుతో సరికొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. వీటి ధరలు రూ. 10,999 నుంచి ప్రారంభమవుతున్నాయి.
Motorola Revou2 TVs
Lenovo యాజమాన్యంలోని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మోటోరోలా భారత మార్కెట్లో తమ స్మార్ట్ టీవీ సిరీస్ ను లాంచ్ చేసింది. Motorola Revou2 TV పేరుతో విడుదలలైన ఈ స్మార్ట్ టీవీ లైనప్‌లో వివిధ స్క్రీన్ పరిమాణాలు, రిజల్యూషన్‌లలో మొత్తం నాలుగు మోడల్‌లు ఉన్నాయి. ధరలు కేవలం రూ. 11 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.
ఈ పండగ సీజన్ లో సరసమైన ధరలో ఏదైనా మంచి బ్రాండ్‌కి చెందిన టీవీలు కొనాలనుకునే వారికి మోటోరోలా స్మార్ట్ టీవీలు మంచి ఛాయిస్ అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా విడుదలైన మోటోరోలా టీవీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
Motorola Revou2 స్మార్ట్ టీవీలు నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. బేస్ వేరియంట్ 32-అంగుళాల స్క్రీన్ సైజ్, HD రిజల్యూషన్‌తో వచ్చింది. ఇక రెండోది 40-అంగుళాల స్క్రీన్ సైజ్ ఫుల్ HD రిజల్యూషన్‌తో వచ్చింది. మూడవది 43-అంగుళాల మోడల్, ఫుల్ HD రిజల్యూషన్‌తో వచ్చింది. ఇక నాల్గవది, టాప్-స్పెక్ మోడల్ కూడా 43-అంగుళాల స్క్రీన్ సైజుతో వచ్చింది. అయితే ఇది ఆల్ట్రా రిజల్యూషన్‌తో మరిన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది.
Motorola Revou2 TVs ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- స్క్రీన్ సైజ్ కాన్ఫిగరేషన్: 32HD/40FHD/43 FHD/ 43 UHD
- 1 GB RAM, 8GB ఇంటర్నల్ స్టోరేజ్
- Mali G52 MP2 GPU క్వాడ్-కోర్ MediaTek ప్రాసెసర్
- Android TV 11 OS
- డాల్బీ విజన్, డాల్బీ ఆడియో- boAt 24W స్పీకర్లు
- డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, ఈథర్నెట్
టాప్-స్పెక్ మోడల్ 43 అంగుళాల Motorola Revou2 UHD TV స్క్రీన్ 4K పిక్చర్ క్వాలిటీ అందించగలదు. 2GB RAM ఉంటుంది HDR10, Dolby Vision, MEMC, ALLM వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది
Motorola Revou2 TVs ధరలు
Motorola Revou2 TV- 32" HD వేరియంట్ ధర: రూ. 10,999/-
Motorola Revou2 TV- 40" FHD వేరియంట్ ధర: రూ.16,999/-
Motorola Revou2 TV- 43" FHD వేరియంట్ ధర: రూ.19,999/-
Motorola Revou2 TV- 43" 4K UHD వేరియంట్ ధర: రూ. 22,999/-
ఈ టెలివిజన్లు ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.