తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Men Mistakes : పురుషులు బెడ్‍పై ఈ 5 తప్పులు చేయకండి

Men Mistakes : పురుషులు బెడ్‍పై ఈ 5 తప్పులు చేయకండి

HT Telugu Desk HT Telugu

25 November 2023, 19:30 IST

google News
    • Men Mistakes In Bed : శృంగార సమయంలో పురుషులు కొన్నిసార్లు ఆందోళన చెందుతారు. ఈ కారణంతో మెుత్తం అంతా పాడైపోతుంది. భాగస్వామి కూడా బాధపడిపోతుంది. అలా పురుషులు చేయకూడని తప్పులు ఏంటో చూద్దాం.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Pixabay)

ప్రతీకాత్మక చిత్రం

శృంగారం అనేది ప్రేమలో తదుపరి దశ. ప్రేమ ఇద్దరి మనసులను ఎంత కలిపేస్తుందో, శృంగారం వారి శరీరాలను కలిపేస్తుంది. అయితే కొత్తగా పెళ్లయిన దంపతులు లైంగిక సంపర్కం సమయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కొంతమంది అసభ్యంగా ప్రవర్తిస్తారు, ఎందుకంటే వారికి సెక్స్‌లో ముందస్తు అనుభవం లేకపోవడమే కారణం. ఫలితంగా వారికి సెక్స్ పట్ల ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. సెక్స్‌లో పురుషులు చేసే 5 విషయాలు మూడ్ అంతా పాడుచేస్తాయి.

కొంతమంది పురుషులు సంభోగం సమయంలో అంగస్తంభన సమస్య గురించి ఆందోళన చెందుతారు. ఇలా టెన్షన్‌లో ఉండటం వల్ల సెక్స్‌లో సరిగా పనిచేయలేక భార్యలకు అసంతృప్తిని కలిగిస్తుంటారు. వారు కూడా నిరుత్సాహానికి గురవుతుంటారు. కొంతమంది పురుషులు తమ అంగస్తంభన, పురుషాంగం పరిమాణం గురించి సందేహం కారణంగా సెక్స్‌కు దూరంగా ఉంటారు.

మరికొందరు పురుషులు లైంగిక ఆనందాన్ని సాధించడంలో తమ భాగస్వామి కంటే తమ స్వంత కోరికనే ఎక్కువగా భావిస్తారు. తమ లైంగిక ఆనందానికి ప్రాధాన్యత ఇచ్చే పురుషులను మహిళలు ఇష్టపడరు. వారు సెక్స్ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు.. కానీ మీ ప్రవర్తనతో ద్వేషిస్తారు. అందుకే మీ కోరికలతోపాటుగా భాగస్వామి కోరికలను తెలుసుకోవాలి.

సెక్స్‌లో క్లైమాక్స్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకునే పురుషులను మహిళలు ఇష్టపడరు. ఫోర్‌ప్లే ఒక ముఖ్యమైన అంశం. దీన్ని వద్దనుకునే పురుషులు తమ భార్యల పట్ల ఆకర్షితులవరు. మీరు మీ భాగస్వామి కోరికలను విననప్పుడు సంభోగం సమయంలో వారిని సంతృప్తిపరచనప్పుడు, మీ సంబంధంలో అంతరం ఏర్పడుతుంది.

సెక్స్‌కు ముందు శుభ్రంగా స్నానం చేసే పురుషులను మహిళలు ఇష్టపడతారు. చెమటతో కూడిన శరీర దుర్వాసన, శారీరక శుభ్రత లోపించడం వంటి కారణాలతో మంచంపైకి వచ్చే పురుషులకు స్త్రీలు ఆకర్షితులవరు. మీ శరీరం ఆరోగ్యంగా, పరిశుభ్రంగా లేనప్పుడు సెక్స్‌కు దూరంగా ఉండటం మంచిది. ఇది లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుండి చర్మ అలెర్జీని నివారిస్తుంది.

చెమటలు కక్కుతూ, పని చేసి అలసిపోయిన మగవాళ్ళను స్త్రీలు ఇష్టపడరు. పని మెుదలుపెట్టగానే అలసిపోకూడదు. క్లైమాక్స్ కూడా త్వరగా రాకూడదు. ముద్దుముచ్చటను స్త్రీలు ఎక్కువగా ఆస్వాదిస్తారు. వారిని తృప్తి పరిస్తే మీ లైంగిక జీవితం ఆనందంగా ఉంటుంది.

తదుపరి వ్యాసం