Couple Massage Benefits : లైంగిక మసాజ్ అంటే ఏంటో తెలుసా? చాలా ప్రయోజనాలు-what is the couple massage in intimacy time and benefits check inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Couple Massage Benefits : లైంగిక మసాజ్ అంటే ఏంటో తెలుసా? చాలా ప్రయోజనాలు

Couple Massage Benefits : లైంగిక మసాజ్ అంటే ఏంటో తెలుసా? చాలా ప్రయోజనాలు

HT Telugu Desk HT Telugu

Couple Massage Benefits In Telugu : కాస్త రొమాంటిక్‍గా లేకుంటే ఆ ఇంట్లో ఎప్పుడు హ్యాపీనెస్ ఉండదు. మీరు మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి జాగ్రత్తగా ఉండాలి. శృంగార సమయంలో సరదాగా మసాజ్ చేయడం గురించి ఇక్కడ తెలుసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం

లైంగిక మసాజ్ అనేది ప్రైవేట్ భాగాలకు హాయిగా అనిపించే ఓ చర్య. ఇది జంటలను దగ్గర చేస్తుంది. ఈ రకమైన స్పర్శ జంటల మధ్య చాలా సాన్నిహిత్యాన్ని తిరిగి తెస్తుంది. లైంగిక మసాజ్ లైంగిక ఆనందాన్ని పెంచడానికి శరీరాన్ని ప్రేరేపిస్తుంది. తద్వారా మీరు ఆ సమయంలో పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. శృంగారానికి ముందు జంటలు ఒకరి శరీరాన్ని మరొకరు మసాజ్ చేసుకోవడం, ఆలింగనం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

లైంగిక మసాజ్‌తో జంటలు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇది శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా ఉంటేనే మంచి సెక్స్‌ను పొందవచ్చు. మసాజ్ అలసిపోయిన శరీరాన్ని కూడా చైతన్యవంతం చేస్తుంది. మీరు ఎంత ఉత్సాహంగా ఉంటే అంత బాగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. అంతే కాదు మీరు మీ భాగస్వామికి మసాజ్ చేసినప్పుడు వారు ఎక్కడ ఎక్కువ భావోద్వేగాలను వ్యక్తం చేస్తారో మీరు తెలుసుకోవచ్చు.

లైంగిక మసాజ్ అనేది యోని/అంగం మసాజ్ (ప్రైవేట్ పార్ట్స్ మసాజ్) వంటి అనేక రకాలుగా ఉంటుంది. ఇదే కాకుండా శరీరానికి మెుత్తం మసాజ్ చేసుకోవచ్చు. మీరు లేదా మీ భాగస్వామి లైంగిక మసాజ్ చేయించుకున్నప్పుడు, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆందోళన తగ్గి శరీరానికి, మనసుకు విశ్రాంతి లభిస్తుంది. అలసిపోయిన తర్వాత, లైంగిక మసాజ్ ప్రతి ఒక్కరిని చాలా యాక్టివ్‍గా చేస్తుంది.

లైంగిక మసాజ్‌కి మీకు, మీ భాగస్వామికి మధ్య చాలా నమ్మకం, కమ్యూనికేషన్ అవసరం. లోతైన ఈ మసాజ్ మీ కోరికలు, అవసరాలను కమ్యూనికేట్ చేయగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇది మీకు, మీ భాగస్వామికి మధ్య ఎక్కువ సాన్నిహిత్యం పెంచుతుంది.

ఈ మసాజ్ సెక్స్ పట్ల ఆసక్తి లేని వ్యక్తులకు, లైంగిక అసమర్థతతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. జననేంద్రియాలకు రక్త ప్రసరణను పెంచడానికి మసాజ్ సహాయపడుతుంది. పురుషులలో అంగస్తంభన పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరం క్లైమాక్స్ కోసం సిద్ధమవుతుంది.

ఒకసారి మీరు లైంగిక మసాజ్ చేయించుకుంటే, మీరు శరీరం, దాని అనుభూతులను బాగా తెలుసుకోవచ్చు. ఇది సెక్స్ జీవితంలో విశ్వాసం, సంతృప్తికి దారి తీస్తుంది. సెక్స్ మసాజ్ ఎక్కువ ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది కండరాల ఒత్తిడి, నొప్పిని తగ్గిస్తుంది.