Intimacy Life : ఈ ఒకే ఒక్క విషయంతో క్లైమాక్స్ ఖతమ్.. లైంగిక జీవితం మటాష్-how anxiety affects your intimacy life all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Intimacy Life : ఈ ఒకే ఒక్క విషయంతో క్లైమాక్స్ ఖతమ్.. లైంగిక జీవితం మటాష్

Intimacy Life : ఈ ఒకే ఒక్క విషయంతో క్లైమాక్స్ ఖతమ్.. లైంగిక జీవితం మటాష్

HT Telugu Desk HT Telugu
Oct 23, 2023 08:00 PM IST

Intimacy Life Tips : ఈ కాలంలో చాలామంది ఎదుర్కొనే అతి పెద్ద సమస్య 'ఆందోళన'. ఇది మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. లైంగిక జీవితం కూడా దెబ్బతింటుంది. మీ సెక్స్ లైఫ్ సంతోషంగా ఉండటానికి భావోద్వేగాలు, భావాలు చాలా ముఖ్యమైనవి.

శృంగార సమస్యలు
శృంగార సమస్యలు

సాధారణంగా ప్రతీ మనిషి జీవితంలో వివిధ సమస్యలు వస్తాయి. అవి మిమ్మల్ని భయాందోళనలకు గురిచేస్తాయి. కొన్నిసార్లు ఆత్రుత, ఒత్తిడికి గురవుతారు. ఇవి మీ శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మీ లైంగిక జీవితాన్ని కూడా నాశనం చేస్తాయి. ఆందోళన ఉంటే.. బెడ్‌పై సెక్స్ చేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా ఆలోచనలు మారవచ్చు. ఫలితంగా మీరు భయాందోళనలకు గురవుతారు. దీంతో సరిగ్గా శృంగారం చేయలేరు. మీరు సెక్స్‌ను సగంలోనే వదిలివేయవచ్చు. లేదంటే అంగం చిన్నగా అయిపోవచ్చు.

ఆందోళన అనేది.. మానసిక, శారీరక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. భాగస్వామితో మంచం మీద ఉన్నప్పుడు ఆందోళన కలిగితే చాలా సమస్యలు వస్తాయి. ఇవన్నీ మీ ఆలోచనతో సహా మీ జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తాయి.

ఆందోళనతో జీవిస్తే.. మీరు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఆందోళనతోనే ఉంటారు. మీ మానసిక స్థితి లిబిడోపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఆందోళన అనేది భయం, అశాంతి, ఉద్రిక్తత ఏదో జరుగుతున్న అనుభూతిని కలిగిస్తుంది. ఇది సెక్స్‌కు ముందు, సెక్స్ సమయంలో కూడా ఉంటే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీని వల్ల మీరు సెక్స్‌లో సరిగ్గా పనిచేయలేరు. మీకు సంతృప్తి లభించదు.

సెక్స్ అండ్ మ్యారిటల్ థెరపీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఆందోళన రుగ్మత ఉన్న మహిళలు సెక్స్ విషయంలో చాలా ఇబ్బందులు చూస్తారు. ఇది మీ జీవిత భాగస్వామితో కనెక్ట్ అవ్వడం, సంతోషంగా ఉండటం కష్టతరం చేస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి.

ఆందోళన మీ లైంగిక జీవితాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. అంగస్తంభన సరిగా జరగదు, అకాల స్ఖలనం, ఆలస్యమైన క్లైమాక్స్, శృంగారం చేస్తుంటేనే అంగం మెత్తబడిపోవడంలాంటివి ఎదుర్కొంటారు. మీకు ఈ లక్షణాలు ఉంటే.. సమస్యను పరిష్కరించవచ్చు. ఆత్మవిశ్వాసం లేకపోవడం ఆందోళన, డిప్రెషన్‌కు ప్రధాన కారణాలు. ఏది జరిగినా ఏం కాదు అనే స్వభావానికి వచ్చేయాలి. ఆత్మవిశ్వాసం లేకపోవడం మీ లైంగిక జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

కొందరు సెక్స్ చేయడం వల్ల కూడా చాలా ఆందోళన చెందుతారు. ప్రత్యేకించి గతంలో కొన్ని లైంగిక పరమైన మానసిక గాయాలు అనుభవించినట్లయితే సెక్స్‌కు దూరంగా ఉండవచ్చు. లైంగిక అనుభవంలో ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడండి. మీ భాగస్వామితో తక్కువ కమ్యూనికేషన్ కూడా సమస్యకు కారణం అవుతుంది.

మీరు ఆందోళన చెందుతున్నప్పుడు మీ ప్రియమైనవారితో మాట్లాడటం చాలా ముఖ్యం. ఆందోళన మీ లైంగిక జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని తెలిపే సంకేతాలలో ఒకటి తక్కువ క్లైమాక్స్. అంటే మీరు ఎంత శృంగారం చేసినా.. అంగం చిన్నగానే ఉంటుంది క్లైమాక్స్ మాత్రం జరగదు. ఆందోళనను అనుభవిస్తే.. క్లైమాక్స్‌ కష్టతరం అవుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఆందోళన చాలా అవాంఛిత ఆలోచనలను సృష్టిస్తుంది. మిమ్మల్ని లైంగిక ఉద్రేక భావాల నుండి దూరం చేస్తుంది.

ఏది ఏమైనా.. మీరు మీ ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఆందోళన కోసం కొన్ని మందులు తీసుకోవడం మీ లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. హార్వర్డ్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, యాంటిడిప్రెసెంట్స్ వంటి మందులు లైంగిక కోరికను తగ్గిస్తాయి తక్కువ లిబిడోకు దారితీస్తాయి.

ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏం చేయవచ్చు?

నిపుణులతో మాట్లాడండి. వారి నుంచి సలహాలు తీసుకోండి. మీ సమస్య గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. తద్వారా వారు అర్థం చేసుకుంటారు. మీకు సహాయం చేస్తారు. దీన్ని ఎలా నివారించాలో తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించాలి. ధ్యానం, యోగా వంటి వ్యాయామాలలో పాల్గొనండి. జీవితంలో ఏది జరిగినా తాత్కాలికమే.. ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు. నచ్చిన విధంగా ఉంటూ.. నచ్చిన పని చేయాలి. ఆందోళనకు దూరంగా ఉండాలి.

Whats_app_banner