Never Share With Partner: భాగస్వామితో అస్సలు పంచుకోకూడని విషయాలు.. ఏమిటంటే?-never share these things with your partner or lover ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Never Share With Partner: భాగస్వామితో అస్సలు పంచుకోకూడని విషయాలు.. ఏమిటంటే?

Never Share With Partner: భాగస్వామితో అస్సలు పంచుకోకూడని విషయాలు.. ఏమిటంటే?

Koutik Pranaya Sree HT Telugu
Nov 23, 2023 03:25 PM IST

Never Share With Partner: మీ భాగస్వామి దగ్గర, ప్రేమికురాలు, ప్రేమికులతో అస్సలే పంచుకోకూడని విషయాలున్నాయి. అవేంటో తెల్సుకుని మీరు వాటిలో ఏమైనా తప్పు చేస్తున్నారేమో చూడండి.

భాగస్వామితో చెప్పకూడని విషయాలు
భాగస్వామితో చెప్పకూడని విషయాలు (pexels)

ప్రేమలో అయినా, వివాహం అయిన తర్వాత అయినా.. భాగస్వాముల బంధం బలంగా ఉండాలి. అలా ఉండాలంటే వారితో కొన్ని విషయాలను కచ్చితంగా పంచుకోకుండా ఉండటమే మేలని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. మన వారే కదా అని అన్నీ చెప్పేసిన తర్వాత ఇద్దరి మధ్యా బేధాభిప్రాయాలు తలెత్తితే.. ఆ గొడవలకి ఈ విషయాలే ప్రధాన కారణాలుగా మారతాయని అంటున్నారు. ఆ విషయాలు ఏమిటంటే...

ఎదుటివారి కుటుంబంపై చెడుగా మాట్లాడకండి :

ఎదుటి వారి కుటుంబంలోని వ్యక్తులపై మీకెలాంటి నెగెటివ్‌ భావాలు ఉన్నా వాటిని భాగస్వామితో పంచుకోకపోవడమే మేలు. బదులుగా మీరే అలాంటి ఆలోచనల్ని మనసు నుంచి వదిలించుకునే ప్రయత్నం చేయండి. గతంలో మీకు ఉన్న రిలేషన్‌షిప్స్‌ గురించి ఇప్పుడు భాగస్వామితో ఎప్పుడూ చర్చించకండి. అందువల్ల అవతలి వారికి ఇన్‌సెక్యూరిటీ పెరిగిపోతుంది. మిమ్మల్ని అనుమానించే పరిస్థితి వస్తుంది.

పాస్‌వర్డ్‌లను చెప్పకండి :

లోలోపల మీకు మాత్రమే తెలిసిన భయాలు లాంటి వాటి గురించి భాగస్వామితో ఎప్పుడూ పంచుకోకూడదు. అలాగే ఫోన్‌లో ఈమెయిల్స్‌, సోషల్‌ మీడియా అకౌంట్లు, బ్యాంక్‌ ఎకౌంట్లలాంటి వ్యక్తిగత పాస్‌వర్డ్‌లను వారితో పంచుకోకండి. సంబంధాలు బాగానే ఉన్నంత వరకు వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులూ రాకపోవచ్చు. కాని, ఏదైనా తేడా వస్తే వీటి వల్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

కొన్ని ఆర్థిక విషయాలు మాట్లాడకండి :

ఆర్థిక విషయాలను భాగస్వామితో పంచుకోవడం అనేది మంచి విషయమే. అయితే సెన్సిటివ్‌గా ఉన్న కొన్ని ఆర్థిక సంబంధమైన విషయాలను మాత్రం చెప్పకుండా ఉండటమే మంచిది. వాటి వల్ల విభేదాలు వస్తాయి, గొడవలు అవుతాయి.. అనేలాంటి అనుమానాలు ఉంటే వాటిని మాత్రం కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుకోవడం అవసరమే.

అసంతృప్తుల్ని వెల్లడించకండి :

ఎంత భాగస్వామి మీద అయినా కొన్ని విషయాల్లో మనకు అసంతృప్తులు ఉంటాయి. కొన్ని అభద్రతా భావాలు ఉండొచ్చు. వాటిని నేరుగా ఎప్పుడూ ఎదుటి వారికి చెప్పవద్దు. అవసరమైన సందర్భం వచ్చినప్పుడు ‘ఇలా కాదు.. ఇలా చేయి ’ అని చెప్పే ప్రయత్నం చేయండి. అంతేకాని ఎదుటి వారి తప్పును ఎత్తి చూపుతున్నట్లు, గొడవ పడుతున్నట్లు వాటిని ఎప్పుడూ చెప్పకండి. అందువల్ల బంధం బలహీనం అయి ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది.

ఇతరుల వ్యక్తిగత విషయాలను చెప్పకండి :

మీ స్నేహితులు మిమ్మల్ని నమ్మి.. వారి వ్యక్తిగత విషయాలు కొన్నింటిని మీతో పంచుకుంటూ ఉంటారు. అలాంటివి అన్నీ తీసుకెళ్లి మీ భాగస్వామి దగ్గర చెప్పకండి. మీ స్నేహితుల ప్రైవసీకి మీరు భంగం కలిగించిన వారవుతారు. అలాగే ఆఫీసుల్లో వచ్చే గాసిప్స్‌ అన్నింటినీ తెచ్చి వీరికి చెప్పకండి. అందువల్ల మీ మీద అనుమానాలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోండి.

Whats_app_banner