Mental Health : జీవిత భాగస్వామి కాదు.. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపేది మేనేజర్లే
10 March 2023, 9:51 IST
- Mental health : మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపేది జీవిత భాగస్వామి అనుకుంటారు. కానీ కాదు.. అని చాలా మంది ఉద్యోగులు చెబుతున్నారు. చాలా మంది ఒత్తిడి ఎదుర్కొనేందుకు కారణం ఏంటో చెప్పారు.
మానసిక ఆరోగ్యం
జీవిత భాగస్వామి, వైద్యులు, నర్సుల కంటే మేనేజర్లు(Managers) మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతారు. ఉద్యోగుల మానసిక ఆరోగ్యంలో(Mental Health) పని వాతావరణం, నిర్వాహకుల పాత్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇటీవలి నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మంది ఉద్యోగులు(Employees) తమ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అతిపెద్ద కారణం తమ పని అని భావిస్తున్నారు.
సర్వేలో పాల్గొన్న మెజారిటీ ప్రజలు అధిక జీతం ఉన్న ఉద్యోగం కంటే మానసిక ఆరోగ్యాన్ని(Mental Health) ఇష్టపడతారు. వేతన కోతలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. సర్వేలో వైద్యులు (51 శాతం) లేదా థెరపిస్టులు (41 శాతం) కంటే మేనేజర్లు (69 శాతం) ప్రజల మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతారని సర్వే వెల్లడించింది. పని సంబంధిత ఒత్తిడి(Work Stress) కారణంగా ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది రాబోయే 12 నెలల్లో ఉద్యోగం నుంచి నిష్క్రమించే అవకాశం ఉందని అంచనా వేశారు.
'మెంటల్ హెల్త్ ఎట్ వర్క్: మేనేజర్స్ అండ్ మనీ' నివేదికను ఈ నెల ప్రారంభంలో ది వర్క్‌ఫోర్స్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించింది. 10 దేశాల నుండి పని చేస్తున్న వారు సర్వేలో పాల్గొన్నారు. సర్వే వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఐదుగురు ఉద్యోగులలో ఒకరు తమ పని వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతున్నారు.
43 శాతం ఉద్యోగులు(Employees) 'తరచుగా' లేదా 'ఎల్లప్పుడూ' అలసిపోతారు. 78 శాతం మంది పనిదినం ముగిసే సమయానికి ఒత్తిడి(Stress), తమ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని చెప్పారు. పని వల్ల వచ్చే ఒత్తిడి మన వ్యక్తిగత జీవితాలకు కూడా ప్రభావితం చేస్తుంది. ఉద్యోగులు ఒత్తిడిలో పని చేస్తున్నారని చెప్పారు. ఇది వారి ఇంటి జీవితం (71 శాతం), శ్రేయస్సు (64 శాతం), సంబంధాలను (62 శాతం) ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది.
కానీ 40 శాతం మంది ఉద్యోగులు పనిలో ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ, సర్వే(Survey)లో పాల్గొన్న వారిలో చాలామంది దాని గురించి తమ మేనేజర్‌లతో ఎప్పుడూ మాట్లాడరు అని ఒప్పుకున్నారు. కొందరు 'నా మేనేజర్ పట్టించుకోవడం లేదు', 'నా మేనేజర్ చాలా బిజీగా ఉన్నాడు' అని భావిస్తున్నారు. మరికొందరేమో.. తమ పని స్వంతంగా మేనేజర్ గుర్తించగలరని అనుకుంటున్నారు. అయితే మేనేజర్లు కూడా ఉద్యోగుల ఒత్తిడి కేటగిరీలో ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం.
టాపిక్