Health Supplements | మీ ఆరోగ్యాన్ని ఉన్నతంగా ఉంచే హెల్త్ సప్లిమెంట్‌లు ఇవిగో!-boost your overall health with these top health supplements ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Health Supplements | మీ ఆరోగ్యాన్ని ఉన్నతంగా ఉంచే హెల్త్ సప్లిమెంట్‌లు ఇవిగో!

Health Supplements | మీ ఆరోగ్యాన్ని ఉన్నతంగా ఉంచే హెల్త్ సప్లిమెంట్‌లు ఇవిగో!

Jan 08, 2024, 08:02 PM IST HT Lifestyle Desk
Mar 08, 2023, 07:15 AM , IST

Health Supplements: మీరు మీ ఆరోగ్యాన్ని ఉన్నతంగా ఉంచుకోవాలని చూస్తున్నారా? అనారోగ్యాల నుండి కోలుకోవడానికి, మీ ఆరోగ్యం బాగుపడటానికి రోజూవారీగా కొన్ని హెల్త్ సప్లిమెంట్లను తీసుకోవాలి. అవేంటో చూడండి.

 ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి హెల్త్ సప్లిమెంట్‌లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సరైన సప్లిమెంట్లతో, మీరు మీ శ్రేయస్సును పెంచుకోవచ్చు. మీ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడంలో మీకు సహాయపడే టాప్ హెల్త్ సప్లిమెంట్‌లను ఇక్కడ తెలుసుకోండి. 

(1 / 7)

 ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి హెల్త్ సప్లిమెంట్‌లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సరైన సప్లిమెంట్లతో, మీరు మీ శ్రేయస్సును పెంచుకోవచ్చు. మీ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడంలో మీకు సహాయపడే టాప్ హెల్త్ సప్లిమెంట్‌లను ఇక్కడ తెలుసుకోండి. (Photo by Polina Tankilevitch on Pexels)

మల్టీవిటమిన్లు: మీ శరీరానికి అవసరమైన అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలను అందించడానికి మల్టీవిటమిన్ సప్లిమెంట్లు గొప్ప మార్గం.   100% వ్యాల్యూ కలిగి ఉన్న మల్టీవిటమిన్స్ తీసుకోవాలి.  

(2 / 7)

మల్టీవిటమిన్లు: మీ శరీరానికి అవసరమైన అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలను అందించడానికి మల్టీవిటమిన్ సప్లిమెంట్లు గొప్ప మార్గం.   100% వ్యాల్యూ కలిగి ఉన్న మల్టీవిటమిన్స్ తీసుకోవాలి.  (Shutterstock)

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు: ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన గుండె, మెదడు,  రోగనిరోధక వ్యవస్థలకు అవసరం. ఇందుకు EPA అలాగే DHAలను కలిగి ఉండే సప్లిమెంట్ కోసం చూడండి.

(3 / 7)

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు: ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన గుండె, మెదడు,  రోగనిరోధక వ్యవస్థలకు అవసరం. ఇందుకు EPA అలాగే DHAలను కలిగి ఉండే సప్లిమెంట్ కోసం చూడండి.(istockphoto)

ప్రోబయోటిక్స్: ప్రోబయోటిక్స్ అనేది మీ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. వివిధ రకాల ప్రోబయోటిక్స్ కలిగి ఉన్న సప్లిమెంట్ కోసం చూడండి.

(4 / 7)

ప్రోబయోటిక్స్: ప్రోబయోటిక్స్ అనేది మీ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. వివిధ రకాల ప్రోబయోటిక్స్ కలిగి ఉన్న సప్లిమెంట్ కోసం చూడండి.(Shutterstock)

విటమిన్ డి: ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు, అలాగే బలమైన రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ డి అవసరం. విటమిన్ D అత్యంత చురుకైన రూపమైన విటమిన్ D3ని కలిగి ఉన్న సప్లిమెంట్ కోసం చూడండి.

(5 / 7)

విటమిన్ డి: ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు, అలాగే బలమైన రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ డి అవసరం. విటమిన్ D అత్యంత చురుకైన రూపమైన విటమిన్ D3ని కలిగి ఉన్న సప్లిమెంట్ కోసం చూడండి.(Getty Images/iStockphoto)

 విటమిన్ సి: విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది మీ కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది.  మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కనీసం 500mg విటమిన్ సి ఉన్న సప్లిమెంట్ కోసం చూడండి.

(6 / 7)

 విటమిన్ సి: విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది మీ కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది.  మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కనీసం 500mg విటమిన్ సి ఉన్న సప్లిమెంట్ కోసం చూడండి.(freepik )

ఇవి మీ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడంలో మీకు సహాయపడే అత్యుత్తమ హెల్త్  సప్లిమెంట్లలో కొన్ని మాత్రమే. ఏదైనా సప్లిమెంట్లు తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. 

(7 / 7)

ఇవి మీ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడంలో మీకు సహాయపడే అత్యుత్తమ హెల్త్  సప్లిమెంట్లలో కొన్ని మాత్రమే. ఏదైనా సప్లిమెంట్లు తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. (Pexels)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు