తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ పథకం.. విద్యార్థులకు 20 వేల స్కాలర్‌షిప్!

గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ పథకం.. విద్యార్థులకు 20 వేల స్కాలర్‌షిప్!

HT Telugu Desk HT Telugu

03 October 2022, 15:57 IST

  • LIC Golden Jubilee Scholarship: LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించింది . పథకం కింద, ఆర్థిక వెనకబడిన విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం అందుతుంది. పిల్లలను ఉన్నత చదువులు చదివించే సామర్థ్యం లేని కుటుంబానికి చెందిన విద్యార్థులకు ఎల్‌ఐసీ ఆపన్న హస్తం అందిస్తోంది.

LIC Golden Jubilee Scholarship
LIC Golden Jubilee Scholarship

LIC Golden Jubilee Scholarship

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. ఎల్ఐసీ ప్రతి సంవత్సరం కొత్త స్కాలర్‌షిప్ పథకాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. 2022 సంవత్సరంలో, LIC విద్యార్థుల కోసం LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించింది . పథకం కింద, ఆర్థిక వెనకబడిన విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం అందుతుంది. పిల్లలను ఉన్నత చదువులు చదివించే సామర్థ్యం లేని కుటుంబానికి చెందిన విద్యార్థులకు ఎల్‌ఐసీ ఆపన్న హస్తం అందిస్తోంది. ఎల్‌ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ ప్రయోజనం 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి కళాశాలలో చేరాలనుకునే పిల్లలందరికీ అందుబాటులోకి రానుంది. వీరికి ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎల్‌ఐసీ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంది.

సంవత్సరానికి రూ. 20,000 స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది. 3 నెలల వ్యవధిలో విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇవ్వబడుతుంది. అంటే నాలుగు నెలలకు రూ. 5000 చోప్పున విద్యార్థి ఖాతాకు DBT (డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా బదిలీ చేయబడుతుంది. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు LIC స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే , వారు అధికారిక వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మోడ్ రెండింటిలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఐసి స్కాలర్‌షిప్ (LIC Chhatrvrti Yojana 2022) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులందరూ క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ప్రక్రియను జాగ్రత్తగా అనుసరించండి.

దేశంలోని ఆర్థిక వెనకబడిన విద్యార్థులు ఎల్‌ఐసి ఛత్రవృత్తికి దరఖాస్తు చేసుకోవచ్చు.

12వ తరగతిలో 65 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులు.

దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం లక్షకు మించకూడదు.

10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే బాలికలందరూ ఎల్‌ఐసి స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రైవేట్ కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో డిప్లొమా, ఐటీఐ, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించాలనుకునే దేశంలోని విద్యార్థులు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్థులు ఇప్పటికే ఇతర స్కాలర్‌షిప్ పథకం నుండి ప్రయోజనం పొందుతున్నట్లయితే, వారు LIC స్కాలర్‌షిప్‌కు అర్హులుగా పరిగణించబడరు .

LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ఇచ్చిన డాక్యుమెంట్స్ సమర్పించవచ్చు:-

ఆధార్ కార్డ్

ఆదాయ ధృవీకరణ పత్రం

బ్యాంకు స్టేట్‌‌మెంట్

10వ, 12వ మార్కుషీట్

పాస్పోర్ట్ సైజు ఫోటో

మొబైల్ నంబర్