తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tech Neck | టెక్ నెక్‌తో వెన్నుపోటు ఖాయం.. ముప్పు నుంచి బయటపడేందుకు టెక్నిక్స్!

Tech Neck | టెక్ నెక్‌తో వెన్నుపోటు ఖాయం.. ముప్పు నుంచి బయటపడేందుకు టెక్నిక్స్!

Manda Vikas HT Telugu

01 September 2022, 22:54 IST

google News
    • ఇటీవలకాలంలో ఎక్కువ మంది టెక్ నెక్ సమస్యతో బాధపడుతున్నారు. కొత్తగా ఈ టెక్ నెక్ అంటే ఏంటి? పరిష్కార మార్గాలు తెలుసుకోండి.
tech neck causes and solutions
tech neck causes and solutions (Unsplash)

tech neck causes and solutions

ఈ మధ్య టెక్ నెక్‌ అనేది బాగా పాపులర్ అవుతుంది. ఈ టెక్ నెక్ అంటే మరేమిటో కాదు ఇది ఒక రకమైన మెడనొప్పి. నేటి కాలంలో పిల్లలైనా, పెద్దవారైనా గంటల కొద్దీ కంప్యూటర్ మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల మెడపట్టేసి, ఆ భాగంలో నొప్పి కలుగుతుంది కాబట్టి దీనిని టెక్నాలజీ నెక్ అంటున్నారు. షార్ట్ కట్ లో టెక్ నెక్. దీనినే టెక్ట్స్ నెక్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే మొబైల్ ఫోన్‌లలో అదే పనిగా చాటింగ్ చేస్తూ మెడ నొప్పి తెచ్చుకుంటున్నారు. అవిశ్రాంతంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఉపయోగిస్తూ తదేకంగా మెడను వంచి పనిచేయటం మూలానా ఈ టెక్ నెక్ అనేది ఈరోజుల్లో సాధారణ సమస్యగా మారింది.

తలను 15 డిగ్రీలు ముందుకు వంచడం వల్ల మన మెడపై 12.5 కిలోల అదనపు బరువు పడుతుందని తాజా అధ్యయనాలు రుజువు చేశాయి. తలను 30 డిగ్రీల ముందుకు వంచితే వద్ద మెడపై 16 కిలోల భారం, అదేవిధంగా 60 డిగ్రీలు వంగినప్పుడు 27.2 కిలోల వరకు మీ శరీర బరువు మెడపై పడుతుంది.

దీనివల్ల తరచుగా మెడ ప్రాంతంలో నొప్పి వస్తుంది. అలాగే భుజాలు, వెన్ను ప్రాంతాలలో కూడా కండరాలు అలసిపోయినట్లుగా అసౌకర్యం మొదలవుతుంది. దీని ప్రభావంతో వెన్నులో పొడిచినట్లుగా నొప్పి, తలనొప్పి, మెడ పట్టేయడం, దవడ నొప్పి, కీళ్ల నొప్పులు ఉంటాయి.

ఈ పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే కండరాలపై ఒత్తిడి పెరిగి అంతర్లీనంగా గాయాలవవచ్చు, కీళ్ల ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది. ఆడివారిలో గర్భాశయ వెన్నెముక, సహాయక కండరాలపై భారం పెరిగి కోలుకోలేని దెబ్బతీయవచ్చు. ఇదంతా మీరు మీ కంప్యూటర్ స్క్రీన్ లేదా మొబైల్‌ని ఎక్కువసేపు చూసేందుకే ఈ పరిస్థితికి దారి తీస్తుంది.

టెక్ నెక్స్ సమస్య నుంచి బయటపడాలంటే, వెంటనే మీరు మీ మెడను వంచే భంగిమను సరిచేసుకోవాలి. మెడ, కళ్లపై భారం పడకుండా తగినంత దూరం నుంచి స్క్రీన్‌ను చూడాలి. కంప్యూటర్లపై ఎక్కువగా పనిచేసే వారు మధమధ్యలో విరామాలు తప్పకుండా తీసుకోవాలి, వీలైనపుడల్లా మీ కండరాలను స్ట్రెచింగ్ చేస్తూ ఉండాలి.

ముంబైలోని గ్లోబల్ హాస్పిటల్స్ లో స్పైన్ సర్జన్ అయినటువంటి డాక్టర్ హర్షల్ బాంబ్ తెలిపారు.

ఎర్గోనామిక్స్ పాటించడం

మీ భంగిమను సరిచేసుకోవాలి. ల్యాప్‌టాప్‌లపై పనిచేసేటపుడు స్టాండ్‌లను ఉపయోగించడం, అలాగే డెస్క్‌టాప్‌లను కంటికి సమానమైన స్థాయిలో అమర్చడం వంటివి చేయాలి. మెడ వంచకుండా సరైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.

విరామాలు తీసుకోవడం

మనం ఎలాంటి ఎర్గోనామిక్స్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, సరైన శరీర భంగిమ కోసం సవరణలు చేసుకున్నప్పటికీ అడపాదడపా విరామాలు తీసుకోవాలి. చిటికెలో వస్తానని చెప్పి చిన్న బ్రేకులు తీసుకోవటం తప్పనిసరి. అలాగే, అడపాదడపా కండరాలను సాగదీయడం ద్వారా రక్త సరఫరా సరిగ్గా ఉంటుంది. ఇది కండరాలను టోన్‌ చేస్తుంది. కండరాల అలసటను తగ్గిస్తుంది.

కండరాలను బలోపేతం చేయడం

శరీరంలోని ట్రాపెజియస్ కండరం, స్కాపులోథొరాసిక్ కండరాలను బలోపేతం చేసుకోవాలి. ఇందుకు నిపుణుల సహాయం తీసుకోండి. ఇవి గర్భాశయ వెన్నెముకకు బలాన్ని చేకూరుస్తాయి. కండరాలు దృఢంగా ఉంటే మెడ నొప్పిని ఎదుర్కోవచ్చు.

జీవనశైలిలో మార్పు

ఇదే చాలా ముఖ్యమైనది. గాడ్జెట్ల వాడకాన్ని తగ్గించండి. చురుకైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. బలమైన ఆహారం తీసుకోండి. మీ వైఖరిలో మార్పు, మీరు చేసే ప్రయత్నాలతోనే మీ శరీరాన్ని, మీ వెన్నెముకను కాపాడుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం