తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Multivitamins For Men । మగవారి ఆరోగ్యానికి ఈ మల్టీవిటమిన్లు చాలా అవసరం!

Multivitamins For Men । మగవారి ఆరోగ్యానికి ఈ మల్టీవిటమిన్లు చాలా అవసరం!

HT Telugu Desk HT Telugu

24 January 2023, 12:31 IST

google News
    • Essential Multivitamins For Men: పురుషులలో సామర్థ్యాన్ని పెంచడం, అభిజ్ఞా ప్రక్రియలను మెరుగుపరచడం, శక్తి స్థాయిలను పెంచడం, రోగనిరోధక శక్తికి మొత్తంగా వారి ఆరోగ్యానికి మల్టీవిటమిన్లు అవసరం. ఏయే పోషకాలు అవసరమో తెలుసుకోండి.
Essential Multivitamins For Men
Essential Multivitamins For Men (istock)

Essential Multivitamins For Men

శరీరానికి అవసరమయ్యే కొన్ని పోషకాలు కేవలం మనం తినే ఆహారం ద్వారా మాత్రమే లభించవు. కొన్నింటిని సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. స్త్రీల కంటే పురుషులకు భిన్నమైన పోషకాహార అవసరాలు ఉంటాయి, వయస్సు పెరిగే కొద్దీ ఆ అవసరాలు మారవచ్చు. ఉదాహరణకు పురుషులలో సంతాన సామర్థ్యం మెరుగుపడేందుకు జింక్ అనే ఖనిజం అధికస్థాయిలో అవసరం అయ్యే పోషకం. ఇది స్పెర్మ్ కౌంట్ పెరుగుదల, చలనశీలత అలాగే గర్భధారణ ఫలితాలతో స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

అదనంగా పురుషులలో రోగనిరోధక శక్తి పెరగటానికి, వారి శ్రేయస్సుకు విటమిన్ సి, విటమిన్ ఇ , విటమిన్ కె వంటి పోషకాలు కావాలి. బలమైన ఎముకల కోసం విటమిన్ డి, కాల్షియం. గుండె ఆరోగ్యానికి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కంటి ఆరోగ్యానికి విటమిన్ A, శక్తి జీవక్రియ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ B, ఇక రోగనిరోధక వ్యవస్థకు బలోపేతం చేయడం, కొల్లాజెన్ ఉత్పత్తి కోసం, ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడం కోసం విటమిన్ సి అవసరం అవుతాయి.

Essential Multivitamins and Minerals For Men- మగవారికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు

సాధారణంగా మగవారు తమ ఆరోగ్యాన్ని తరచూ విస్మరిస్తుంటారు. అదనంగా హానికరమైన అలవాట్లు, నిర్లక్ష్యమైన ధోరణి వారిని జబ్బుపడేలా చేస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వారికి రోజూవారీగా వివిధ రకాల పోషకాలు అవసరం అవుతాయి. ఆహారం ద్వారా లభించని పోషకాల భర్తీని వారు సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాల్సి ఉంటుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మగవారికి అవసరమయ్యే మల్టీ విటమిన్లు, మినరల్స్ గురించి ఇప్పుడు చర్చించుకుందాం

జింక్

శాకాహారులు తరచుగా జింక్ లోపంతో బాధపడుతుంటారు. జింక్ మగవారికి నిర్ధిష్ట సమయంలో చాలా అవసరమయ్యే అత్యంత కీలకమైన పోషకం. ఇది వారికి కొన్ని ప్రత్యేక అవసరాలను తీర్చడంతో పాటు, ఇన్ఫెక్షన్‌లతో పోరాడడంలో, గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది, ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కలిగి ఉంటారని గమనించవచ్చు.

విటమిన్ డి

మగవారికి అవసరమయ్యే మొత్తంలో విటమిన్ డి తీసుకోవడం చాలా అవసరం. ఇది వారిలో కండరాల కదలిక, అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం శోషణ రేటును నిర్వహించడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది.

కాల్షియం

కాల్షియం మగవారిలో కండరాలు, నరాల బలోపేతానికి ఎముకల మరమ్మత్తు, అభివృద్ధికి చాలా అవసరమైన, ముఖ్యమైన పోషకం. ముఖ్యంగా 20 ఏళ్లలోపు పురుషులలో ప్రధాన ఎముకల పెరుగుదల జరిగుతుంది. ఆ సమయంలో కాల్షియం చాలా అవసరం.

విటమిన్ సి

మగవారిలో ప్రోస్టేట్ గ్రంధి విస్తరణ, మూత్ర విసర్జన సమస్యలు మొదలైన వయస్సు సంబంధిత సమస్యలను నివారించడానికి రోజువారీగా విటమిన్ సి తీసుకోవడం చాలా ముఖ్యం.

పొటాషియం

ఈరోజుల్లో ముఖ్యంగా పురుషులకు చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు సంభవిస్తున్నాయి. దీనిని నివారించాలంటే వారికి పొటాషియం మూలకం అవసరం. ఈ పోషకం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.రక్త నాళాలు, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

విటమిన్ ఎ

ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ, మంచి కంటి చూపును కలిగి ఉండటానికి, మగవారు విటమిన్ ఎ తీసుకోవడం పెంచాలి. అంతేకాదు మగవారికి సంక్రమించే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా విటమిన్ ఎ సహాయపడుతుంది.

అయితే పురుషులు ఈ మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. వీటితో పాటు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం కొనసాగించాలి.

తదుపరి వ్యాసం