తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Probiotic Curd Rice । వేసవిలో పెరుగన్నం తినండి.. ప్రయోజనాలు చూడండి!

Probiotic Curd Rice । వేసవిలో పెరుగన్నం తినండి.. ప్రయోజనాలు చూడండి!

HT Telugu Desk HT Telugu

04 August 2024, 1:25 IST

google News
    • Probiotic Curd Rice: వేసవిలో పెరుగు అన్నం తినడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగన్నం తినడం ద్వారా  కలిగే ప్రయోజనాలను (Curd Rice benefits) తెలుసుకోండి. 
Probiotic Curd Rice:
Probiotic Curd Rice: (Unsplash)

Probiotic Curd Rice:

Probiotic Curd Rice: వేసవిలో పెరుగు అన్నం తినడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఎవరైనా తినొచ్చు. పెరుగులో విటమిన్ సితో పాటు ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే అన్నంలో మంచి మొత్తంలో స్టార్చ్ ఉంటుంది. ఈ రెండింటి కలయిక ఒక మంచి పోషకాహారం అవుతుంది.

సాధారణంగా పెరుగన్నంను అప్పుడే వండిన అన్నంతో కాకుండా చల్లటి అన్నంతోనే తయారుచేస్తారు. లేదా రాత్రంతా నానబెట్టిన దీని కారణంగా ఇది ప్రోబయోటిక్‌గా మారుతుంది, మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగన్నం తినడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలను (Curd Rice benefits) తెలుసుకుందాం.

ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి

పెరుగు అన్నంలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, కడుపుకు చాలా మేలు చేస్తుంది. ఈ అన్నం మీ గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది, జీర్ణవ్యవస్థ పనితీరును పెంచడంలో సహాయపడుతుంది. ఇది మీ జీవక్రియను కూడా పెంచుతుంది. మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

శీతలీకరణ

పెరుగు అన్నం కడుపులో కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల వేసవిలో కడుపులో చికాకు, అజీర్ణం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. దీనితో పాటు, బరువు తగ్గే వారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది శక్తిని పెంచడం ద్వారా బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది.

ఉబ్బరానికి మేలు చేస్తుంది

పెరుగు అన్నం తినడం వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇది త్వరగా, సౌకర్యవంతంగా జీర్ణమవుతుంది. ఆమ్ల పిత్త రసం యొక్క అధిక ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీంతో ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరిచేరవు. కాబట్టి, ఈ కారణాల వల్ల, మీరు పెరుగు అన్నం తీసుకోవాలి.

ప్రోబయాటిక్ పెరుగు అన్నం రెసిపీ:

ప్రోబయాటిక్ పెరుగు అన్నం చేయడం చాలా సింపుల్, ముందుగా బియ్యాన్ని రాత్రంతా నానబెట్టండి. ఆ తర్వాత ఉదయాన్నే పెరుగులో కలపాలి. రుచికోసం ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసి పోపు వేసుకోవచ్చు. పైనుంచి కొంచెం కొత్తిమీర , ఉప్పు వేసి తింటే చాలా రుచిగా ఉంటుంది.

తదుపరి వ్యాసం