తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curd Oats Recipe: పెరుగు ఓట్స్.. వేసవిలో చల్లగా, ఆరోగ్యకరమైన బ్రేక్‍ఫాస్ట్

Curd Oats Recipe: పెరుగు ఓట్స్.. వేసవిలో చల్లగా, ఆరోగ్యకరమైన బ్రేక్‍ఫాస్ట్

17 May 2023, 6:19 IST

google News
    • Curd Oats recipe: కర్డ్ ఓట్స్ (పెరుగు ఓట్స్) ఈ వేసవిలో బ్రేక్‍ఫాస్ట్‌కు బాగా సూటవుతుంది. ఆరోగ్యవంతమైన ఈ రెసిపీ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
Curd Oats Recipe: పెరుగు ఓట్స్.. వేసవిలో చల్లగా, ఆరోగ్యకరమైన బ్రేక్‍ఫాస్ట్ (Photo: Unsplash)
Curd Oats Recipe: పెరుగు ఓట్స్.. వేసవిలో చల్లగా, ఆరోగ్యకరమైన బ్రేక్‍ఫాస్ట్ (Photo: Unsplash)

Curd Oats Recipe: పెరుగు ఓట్స్.. వేసవిలో చల్లగా, ఆరోగ్యకరమైన బ్రేక్‍ఫాస్ట్ (Photo: Unsplash)

Curd Oats recipe: వేసవి కాలంలో చల్లదనం కోసం బ్రేక్‍ఫాస్ట్ చేసుకోవాలనుకుంటున్న వారి కోసం ఓ విభిన్నమైన రెసిపీ ఇది. ఓట్స్ రెగ్యులర్‌గా తినే వారు ఈ వేసవిలో చల్లగా.. కాస్త డిఫరెంట్‍గా ఉండే వంటను ట్రై చేయాలనుకుంటే కూడా దీన్ని చేసుకోవచ్చు. ఈ పెరుగు ఓట్స్ (Curd Oats).. ఆరోగ్యకరం కూడా. సుమారు 25 నిమిషాల్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ కర్డ్ ఓట్స్ (పెరుగు ఓట్స్) ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Curd Oats recipe: ఈ రెసిపీ కోసం ఏ రకమైన ఓట్స్ అయినా వాడవచ్చు.

Curd Oats recipe: పెరుగు ఓట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు

  • ముప్పావు (3/4) కప్పు ఓట్స్
  • ఉడికించుకునేందుకు సరిపడా నీరు
  • 1 నుంచి ఒకటిన్నర కప్పు వరకు పెరుగు
  • 2 టేబుల్ స్పూన్‍ల ఉల్లిపాయ చిన్న ముక్కలు
  • 2 టేబుల్ స్పూన్‍ల క్యారెట్, కీర దోసకాయల తరుము
  • సరిపడా ఉప్పు, కొత్తమీర ఆకులు
  • ఓ టీస్పూన్ స్పూన్ ఆయిల్
  • అర టేబుల్ స్పూన్ ఆవాలు
  • పావు టీ స్పూన్ జీలకర్ర
  • కరివేపాకు, చిటికెడు ఇంగువ
  • అర టీస్పూన్ అల్లం
  • 2 నుంచి 3 పచ్చిమిర్చి

తయారీ విధానం

  • Curd Oats recipe: ముందుగా స్టవ్ మీద ఓ బాండీలో ఓట్స్ వేసి, సరిపడా నీరు పోసుకోవాలి.
  • అనంతరం ఓట్స్‌ను ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • ఇక ఉడికిన ఆ ఓట్స్‌లో బాగా కలుపుకున్న పెరుగు, క్యారెట్ తురుము, కీరదోస తురుము, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, తరుగుకున్న కొత్తిమీర ఆకులు, సరిపడా ఉప్పు వేసుకోవాలి.
  • అనంతరం మొత్తం బాగా కలపాలి.
  • ఆ తర్వాత పోపు (తిరువాత) కోసం మరో ప్యాన్‍ను స్టవ్‍పై వేడి చేసుకోవాలి.
  • అందులో కాస్త నూనె పోసి, వేడి కానివ్వాలి.
  • నూనె వేడి అయిన తర్వాత దాంట్లో అవాలు, జీలకర్ర వేయాలి. అవాలు చిట్లిన తర్వాత మినపగుండ్లు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి.
  • ఆ తర్వాత అల్లం తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. అల్లం వాసన రావడం మొదలయ్యాక స్టవ్ ఆపేయాలి. కాస్త ఇంగువ వేయాలి.
  • ఇప్పుడు ఈ పోపును ఉడికించుకొని తురుములు కలుపుకున్న ఓట్స్‌లో వేయాలి. అంతే పెరుగు ఓట్స్ (Curd Oats) రెడీ అయినట్టే.

దీన్ని అలానే అయినా తినవచ్చు. లేకపోతే ఏదైనా పచ్చడి, పొడిని అంచుకొని తినవచ్చు.

Curd Oats: ఇన్‍స్టంట్ ఓట్స్/రోల్డ్ ఓట్స్‌తో కూడా ఈ పెరుగు ఓట్స్ ను తయారు చేసుకోవచ్చు. ఉడికించుకోకుండా.. ఇన్‍స్టంట్ ఓట్స్‌లో సరిపడా వేడి నీరు వేస్తే సరిపోతుంది. ఇక పెరుగు వేయడం నుంచి మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ ఇలానే ఉంటుంది.

తదుపరి వ్యాసం