తెలుగు న్యూస్  /  Lifestyle  /  Its Does Not Matter How Slowly You Go As Long As You Do Not Stop

ఎంత స్లోగా వెళ్లామనేది కాదు అన్నయ్య.. లక్ష్యం సాధించామా లేదా అనేదే మేటర్

HT Telugu Desk HT Telugu

21 April 2022, 7:44 IST

    • మన లక్ష్యాలను సాధించడానికి.. మనం నిరంతరం కృషి చేయాలి. సరైన ప్రణాళిక, విశ్లేషణ, వ్యూహాల అమలు కూడా అవసరం. ఈ నిరంతరమైన ప్రక్రియలో ఎక్కడో ఓచోట మనకు అలుపు వచ్చేస్తుంది. ఆ సమయంలో ఆగకుండా.. కాస్త నిదానంగా, మెల్లిగా అయినా సరే మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించండి. ఎంత వేగంగా వెళ్తున్నారు అనేది కాదు. మీ లక్ష్యం కోసం ఎంత దూరం వెళ్లగలిగారనేదే అసలైన విజయం.
ఒక్కోసారి ఎంత దూరం వెళ్లామనేదే ముఖ్యం
ఒక్కోసారి ఎంత దూరం వెళ్లామనేదే ముఖ్యం

ఒక్కోసారి ఎంత దూరం వెళ్లామనేదే ముఖ్యం

Today Motivation | కొంతమంది వేగంగా పని చేయడానికి ఇష్టపడతారు. మరికొందరు నిదానంగా, నెమ్మదిగా వెళ్లిన పర్లేదు.. విజయం మాత్రం తప్పక సాధించాలని చూస్తారు. ఈ రెండిటిలోనూ తప్పులేదు. ఎందుకంటే.. ఈ తత్వాలు అనేవి.. వ్యక్తిత్వం, అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. మీ లక్ష్యాలు సాధించడం కొన్నిసార్లు కష్టం అవ్వొచ్చు. ఆ సమయంలో మనకెందుకులే అని వదిలేయకుండా.. నెమ్మదిగా అయినా లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలి. ఆ సమయంలో ధైర్యంగా, నిబ్బరంగా ఉండడమనేది చాలా ముఖ్యం.

ట్రెండింగ్ వార్తలు

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో మేకల కాపరి ముఖం ఎక్కడుందో తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు

Chanakya Niti Telugu : ఈ సక్సెస్ సూత్రాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి

Strawberry Pancake: స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే పిల్లలకి తెగ నచ్చేస్తుంది

Friday Motivation: జీవితంలో సమస్యలు ఎప్పటికీ పోవు, వాటి గురించి మర్చిపోయి ఉన్న ఒక్క జిందగీ ఆస్వాదించండి

మనకన్నా ముందు వెళ్తున్నవారిని, వేగంగా వెళ్లే వారిని చూసి ఆగిపోకూడదు. మన ప్రయత్నాలను ఆపనప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. సవాళ్లను స్వీకరించి ముందుకు వెళ్లడంలోనే అసలైన విజయం ఉంది. మన అందరికీ తెలిసిన కుందేలు-తాబేలు కథ. దీనిలో కుందేలు మొదట వేగంగా వెళ్తుంది. రేస్​లో తాబేలుకు కనిపించనంత దూరం వెళ్లి.. రేస్​ను ముగించకుండా.. విశ్రాంతి తీసుకుంటుంది. కానీ తాబేలు నెమ్మదిగానే.. తన ప్రయాణాన్ని ఆపకుండా.. కుందేలు వెళ్లిపోయింది కదా అని విశ్రమించకుండా.. ముందుకు సాగి విజయం సాధిస్తుంది. మీరు కూడా పట్టుదల, జీవిత లక్ష్యాలను చేరుకోవాలనే సంకల్ప శక్తి ఉంటే.. విజయం మీ సొంతమవుతుంది.

టాపిక్