Mushroom In Rainy Season : వర్షాకాలంలో పుట్టగొడుగులు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?
26 June 2023, 9:00 IST
- Mushroom In Rainy Season : మష్రూమ్ కర్రీ, మష్రూమ్ బిర్యానీ, మష్రూమ్ చిల్లీ, ఇతర మష్రూమ్ స్పెషల్ ఫుడ్స్ మీ నోటిలో నీళ్లు తెప్పిస్తాయి కదా? అయితే ఈ పుట్టగొడుగులను వర్షాకాలంలో తినడం సురక్షితమేనా? అనేది చాలా మంది ప్రశ్న. నిజమేంటి?
వానకాలంలో పుట్టగొడుగులు
పుట్టగొడుగులు(Mushroom) అంటే కొంతమందికి చాలా ఇష్టం. కానీ వాటిని తినాలంటే కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి. వాటిలో విషపు పదార్థం ఉంటుందని కొంతమంది మాట్లాడుకుంటారు. భూమి చల్లబడినప్పుడు పుట్టగొడుగులు పెరగడం ప్రారంభిస్తాయి. పుట్టగొడుగులు తిన్న తర్వాత అనారోగ్యానికి గురవుతున్న వ్యక్తుల కేసులు కొన్ని విన్నప్పుడు, వర్షాకాలంలో పుట్టగొడుగులు(Mushroom In Rainy Season) సురక్షితంగా ఉన్నాయా అనే ప్రశ్న తలెత్తుతుంది.
సీజనల్ ఫుడ్(Seasoanl Food) ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. పుట్టగొడుగులు వర్షాకాలంలో (సహజంగా) మీకు లభిస్తాయి. వర్షం పడి భూమి చల్లబడినప్పుడు, పుట్టగొడుగులు పెరగడం ప్రారంభిస్తాయి. రకరకాల పుట్టగొడుగులు పెరగడం ప్రారంభిస్తాయి. అన్ని రకాల పుట్టగొడుగులు తినదగినవి కావు. దీని గురించి తెలుసుకోవాలి. కొన్ని పుట్టగొడుగులు తినదగిన పుట్టగొడుగులవలె కనిపిస్తాయి, కానీ అవి విషపూరితమైనవి. వీటి ద్వారా వ్యాధి బారిన పడే అవకాశం కూడా ఉంది.
పుట్టగొడుగులను సరిగ్గా ఉడికించాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు(Health Problems) రావచ్చు. కాబట్టి పుట్టగొడుగులను వండేటప్పుడు, కుళ్ళిపోయే దశలో ఉన్న పుట్టగొడుగులను ఉపయోగించవద్దు. ఎందుకంటే వాటిలో బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి అలాంటి పుట్టగొడుగులను తినకండి.
వర్షాకాలంలో పెరిగిన పుట్టగొడుగులను తింటే పెద్దగా ఇబ్బందులు రావు. చింతించకుండా తినవచ్చు. కానీ మీరు పుట్టగొడుగులను తీసుకువస్తే, త్వరగా వండుకోండి. అవి కుళ్ళిపోయే దశలో ఉన్నప్పుడు వాటిని ఆహారం కోసం ఉపయోగించవద్దు. వానకాలంలో తినే పుట్టగొడుగులను సరిగా గమనించండి. అవి తినదగినవే అయితే.. మాత్రమే తినండి. కొన్ని తినగదగినవిలా కనిపిస్తాయి.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. పుట్టగొడుగులు తింటే చాలా మంచిది. అయితే వాటిని సరిగా చూసి తెచ్చుకోవాలి. వర్షాకాలం(Rainy Seasons)లోనూ పుట్టుగొడుగులు తినొచ్చు. కానీ తినే రకం మీదనే అంతా ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల ఫంగస్ ఉండే ప్రమాదం ఉంది.. మీరు ఎంత పరిశీలించి తెచ్చుకుంటే అంత మంచిది.
పుట్టగొడుగుల వల్ల కలిగే ప్రయోజనాలు
పుట్టగొడుగుల్లో విటమిన్ డి(Vitamin D) ఉంటుంది, వర్షాకాలంలో ఎండలు తక్కువగా పడతాయి కాబట్టి విటమిన్ డి కూడా ఎక్కువగా లభించదు. కానీ మష్రూమ్ తినడం వల్ల అందులో విటమిన్ డి అందుతుంది. పుట్టగొడుగులలోని అమినో యాసిడ్, ఎర్గోథియోనిన్ కంటెంట్ వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. పుట్టగొడుగులను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
పుట్టగొడుగులు కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వర్షాకాలంలో పొట్ట ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. పుట్టగొడుగులను తినడం వల్ల పొట్ట ఆరోగ్యం(Stomach Health) మెరుగుపడుతుంది. పుట్టగొడుగులలో కడుపు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రీబయోటిక్స్ ఉంటాయి. రోగ నిరోధక శక్తి(Immunity)ని పెంచుతుంది. వర్షాకాలంలో చర్మానికి తగినంత సూర్యరశ్మి రానప్పుడు, రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
మాంసంలో ఉండే పోషకాలు పుట్టగొడుగుల్లో ఉంటాయి. శాకాహారులు పుట్టగొడుగులను తింటే మాంసంలో ఉండే పోషకాలు అందుతాయి. కానీ చాలా మంది శాకాహారులు పుట్టగొడుగులను తినరు. పుట్టగొడుగులను తిన్నవారికి మాంసంతో సమానమైన పోషకాలు అందుతాయి. వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పిల్లలకు మష్రూమ్ సూప్(mushroom soup) తయారు చేసి ఇవ్వండి.