Telugu Serials : కడుపుతో ఉన్నానని చెప్పి బొప్పాయి తిన్న స్వప్న.. డాక్టర్ వచ్చాక ఏంటి పరిస్థితి?
Brahmamudi Serial : బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, కృష్ణ ముకుందా మురారి సీరియల్స్ ఆసక్తిగా సాగుతున్నాయి. రోజు రోజుకు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. జూన్ 26న సోమవారం ఎపిసోడ్స్ లో ఏం జరగనుందో చూద్దాం.
బ్రహ్మముడి సీరియల్ ఆసక్తిగా సాగుతోంది. రాజ్ కు దగ్గరయ్యేందుకు కావ్య ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరోవైపు కొత్తగా పెళ్లై వచ్చిన స్వప్న, తన భర్త రాహుల్ మీద ఇంట్లో వాళ్లకు కంప్లైంట్ ఇచ్చింది. కనకమేమో సేటును కిడ్నాప్ చేసి ఇంట్లోనే పెట్టింది. తన అక్క కడుపు విషయం ఎక్కడ బయటపడుతుందోనని కావ్య భయపడుతుంది. దుగ్గిరాల వారి ఇంటిలో తన పుట్టింటి పరువు పోతుందని కావ్య ఆలోచనల్లో పడుతుంది. అలా ఉన్నాయి.. మరి స్వప్న చేసే పనులు. కడుపుతో ఉన్నానని నాటకమాడుతున్న విషయం తెలిసిందే.
జూన్ 26 ఎపిసోడ్లో అందరి ముందు బొప్పాయి తింటు ఉంటుంది స్వప్న. దీంతో నువ్ కడుపుతో ఉన్నావ్ కదా.. ఈ సమయంలో బొప్పాయి తినడమేంటని అపర్ణ ప్రశ్నిస్తుంది. తింటే ఏమవుతుందని స్వప్న అడుగుతుంది. వెంటనే డాక్టర్ ను పిలవాలని ఇంట్లో వాళ్లు అంటారు. స్వప్నక్క విషయం ఎక్కడ బయటపడుతుందోనని కావ్య టెన్షన్లో ఉంటుంది. బొప్పాయి తింటే గర్భం పోతుందనే ప్లాన్ తోనే స్వప్న ఇలా చేసినట్టుగా అర్థమవుతోంది. అందరు కూడా బొప్పాయి తిని కడుపు పొగొట్టుకుందని అనుకునేలా ప్లాన్ వేసినట్టుంది. అయితే డాక్టర్ ను పిలిస్తే ఎలా అనే టెన్షన్ కూడా స్వప్నకు తర్వాతి ఎపిసోడ్లో పట్టుకుంటుంది.
ఇక కృష్ణ ముకుందా మురారి.. సీరియల్ కూడా ఆసక్తిగా సాగుతోంది. ఓ వైపు ముకుందా ప్రేమ, మరోవైపు మురారి, కృష్ణల ప్రేమను చెప్పుకోలేకపోవడాన్ని చూపిస్తున్నారు. కృష్ణ, మురారి దగ్గరగా ఉంటే.. అస్సలు తట్టుకోలేక పోతుంది ముకుందా. ఫామ్ హౌస్ కు కృష్ణ, మురారిరి వెళుతున్నారని తెలిసి.. ముందే వెళ్లింది ముకుందా. అక్కడ కృష్ణ, మురారి ఎంజాయ్ చేస్తుంటే చూసి బాగా హర్ట్ అవుతుంది. అయితే మురారిని టెన్షన్ పెట్టాలనుకుంటుంది. ఫోన్లో ఫొటోలు పంపిస్తే.. డిలీట్ చేస్తాడని, ప్రింట్ అవుట్ తీసి పంపిచాలని డిసైడ్ అవుతుంది. నెక్ట్స్ ఎపిసోడ్లో ఫామ్ హౌస్ చూసుకునే రాజ్ నర్సీ ఆంటిని పిలిచి తన ప్లాన్ వర్కౌట్ చేసేలా ఉంది. కృష్ణను ఎలాగైనా టెన్షన్ పెట్టాలని చూస్తుంది ముకుందా.
గుప్పెడంత మనసు సీరియల్ కూడా ఆసక్తిగా సాగుతోంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ ను ఎలాగైనా చెడగొట్టాలని శైలేంద్ర చూస్తున్నాడు. అయితే జగతి మాత్రం.. స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది. కచ్చితంగా తాను మిషన్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ ను సక్సెస్ చేసి తీరుతానని చెబుతుంది. కుటుంబానికి దూరంగా ఉన్న రుషి.. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నాడు. తల్లి జగతి తనను పంపించి వేసిన విషయాలను తలచుకుని పాపం బాధపడుతున్నాడు రిషి. ఏంజిల్ తో కలిసి మాట్లాడుతున్నప్పుడు కూడా.. ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి బాధపడుతాడు. ఈ విషయం గమనించిన ఏంజిల్ ఏమైందని అడుగుతుంది. తర్వాతి ఎపిసోడ్లో జగతి సక్సెస్ కాకూడదనే శైలేంద్ర చేసే పనులు, ఏంజిల్ తో రిషి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం చూపించే అవకాశం ఉంది.