తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ibps Po Admit Card 2022 Released At Ibps.in Here Is The Instructions To Download Ibps Po Admit Card

IBPS PO Admit Card 2022 Released : IBPS PO, MT అడ్మిట్ కార్డులు డౌన్​లోడ్ చేయడానికి అదే ఆఖరు తేది..

08 October 2022, 7:57 IST

    • IBPS PO Admit Card Released : IBPS PO, MT రిక్రూట్‌మెంట్ పరీక్ష 2022 కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇప్పుడు పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్​లో విడుదల చేసింది. అభ్యర్థులు ibps.inలో దానిని పొందవచ్చు. మరి అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్​లోడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
IBPS PO Admit Card 2022 released
IBPS PO Admit Card 2022 released

IBPS PO Admit Card 2022 released

IBPS PO Admit Card Released : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ 2022 విడుదల చేసింది. IBPS PO, MT రిక్రూట్‌మెంట్ పరీక్ష 2022కి హాజరు కావడానికి నమోదు చేసుకున్న అభ్యర్థులు.. ఇప్పుడు తమ అడ్మిట్ కార్డ్‌ని అధికారిక వెబ్‌సైట్ ibps.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

IBPS PO, MT అడ్మిట్ కార్డ్ 2022ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 16. పరీక్ష వ్యవధి ఒక గంట. మూడు విభాగాలను కలిగి ఉంటుంది.

IBPS PO Admit Card ఇలా డౌన్‌లోడ్ చేయండి..

* అధికారిక వెబ్‌సైట్ ibps.inని సందర్శించండి

* CRP-PO/MTs-XII కోసం డౌన్‌లోడ్ మెయిన్ అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.

* మీ రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి సమర్పించండి.

* IBPS PO ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

* దానిని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.