Workstation Tips : పని ప్రదేశంలో యాక్టివ్‌గా ఉండేందుకు ఉపయోగపడే చిట్కాలివే
11 March 2024, 14:00 IST
- Workstation Tips : పని ప్రదేశంలో యాక్టివ్‌గా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. మనం మూడీగా ఉండకుండా చేసేందుకు పని చేస్తాయి.
పని ప్రదేశంలో పాటించాల్సిన చిట్కాలు
మనం ఎక్కువ సమయం గడిపేది ఆఫీసులోనే. బిజీగా ఉండి.. క్షణాల్లో అలసిపోతాం. చాలా మంది ఆఫీసులో టేబుల్‌పై పడుకుని.. బాస్ నుంచి తిట్లు తింటారు. అలా అలసిపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే కొన్ని రకాల చిట్కాలు పాటించాలి. ఆఫీసులో యాక్టివ్‌గా ఉండవచ్చు. మూడీగా ఉంటే.. అందరు మిమ్మల్ని వెరైటీగానే చూస్తారు. మంచి జీతం పొందలేరు. మీ ఆరోగ్యం కూడా సరిగా ఉండదు.
వెంటనే అలసిపోవడానికి కారణం పనిలో ఒత్తిడి, వెన్నునొప్పి, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అని వైద్యులు చెబుతున్నారు. వ్యాయామం లేకపోవడం, సరైన భంగిమ, సరైన ఆహారం లేకపోతే.. పని కూడా సరిగా ఉండదు. మీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, మీరు పనిలో యాక్టివ్‌గా ఉండవచ్చు.
పనిలో మీరు కూర్చున్న భంగిమ కూడా మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. మీరు కుర్చీపై కూర్చున్నప్పుడు, నిటారుగా, గౌరవంగా కూర్చోవడం సాధన చేయండి. మీ వెన్నెముక ఫ్లాట్‌గా ఉండాలి. మీ భుజాలను వెనుకకు, అబ్స్‌ని లోపలికి లాగి మీ కడుపుతో నేరుగా కూర్చోండి. వెన్నెముక నీటారుగా పెట్టి కుర్చుంటే చాలా సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు యాక్టివ్ గా ఉంటారు. నడుం నొప్పి, వెన్నెముక నొప్పి రాదు.
పని ఎంత ఎక్కువగా ఉన్నా.. ఒకే దగ్గర కూర్చొకూడదు. ఎక్కువ సేపు కూర్చుంటే చాలా సమస్యలు వస్తాయి. మీ సీటు నుండి లేచి కొద్దిసేపు నడవండి. ప్రతి గంటన్నరకు ఒకసారి ఇలా చేయండి. కావాలంటే కూర్చొని కొన్ని వ్యాయామాలు చేయవచ్చు. ఇది మీకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఒకేలా కూర్చొని ఉంటే కచ్చితంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెుత్తం ఆరోగ్యానికి మంచిది కాదు.
మీ చేతులను మీ వెనుకకు పట్టుకుని, మీ భుజాలను వెనక్కి లాగండి. మీ మెడను సవ్యదిశలో, అపసవ్య దిశలో తిప్పండి. తల కిందకు పైకి వంచుతూ ఉండండి. మెడను కుడి భుజం వైపుకు ఆపై ఎడమ భుజం వైపుకు వంచండి. ఈ వ్యాయామం మీ తుంటి, మెడ, చేతులకు మంచి వ్యాయామం. చాలా మంది ఆఫీసులో చేసే వర్క్ తో మెడ సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు మెడ నొప్పులు రావు.
అనుకుంటాం కానీ చిన్న చిన్న విషయాలు కూడా చేయాలి. మీరు పెన్ను కింద పెట్టడం, దానిని తీయడానికి కిందికి వంగడం లాంటివి కూడా చేయవచ్చు. లేదా కుర్చీలోంచి కూడా ఇలా తీయవచ్చు. ఇది మీ కాళ్ళకు మంచి రక్త ప్రసరణను అందిస్తుంది. పని ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ నడుముకు కూడా మంచి చేస్తుంది.
ఒకే చోట కూర్చునే బదులు లేచి నడుస్తూ ఉండాలి. మీ చేతులను మీ తుంటి వెనుకకు అనుకోవాలి. మీ భుజాలను వెనక్కి లాగి, మీ కాళ్ళను ఒక్కొక్కటిగా పైకి లేపి నడవండి. ఇది మీ రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. కాళ్ళలో వాపును నివారిస్తుంది. ఈ చిట్కాలు మీరు ఆఫీసు పనివేళల్లో యాక్టివ్‌గా ఉండటానికి సహాయపడతాయి.