Double Sided Bra Sticker : కేవలం 2 రూపాయలుంటే చాలు.. భుజాల నుంచి బ్లౌజ్ జారిపోదు-just 2 rupees is enough for the blouse does not slip from the shoulders ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Double Sided Bra Sticker : కేవలం 2 రూపాయలుంటే చాలు.. భుజాల నుంచి బ్లౌజ్ జారిపోదు

Double Sided Bra Sticker : కేవలం 2 రూపాయలుంటే చాలు.. భుజాల నుంచి బ్లౌజ్ జారిపోదు

Anand Sai HT Telugu
Mar 06, 2024 12:30 PM IST

Bra Wearing Tips : చాలా మంది మహిళలు ఎదుర్కొనే సమస్య భుజాల నుంచి బ్లౌజ్ జారిపోవడం. ఈ విషయం చాలా చిరాకుగా అనిపిస్తుంది. కానీ కేవలం 2 రూపాయలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

బ్లౌజ్ కోసం చిట్కాలు
బ్లౌజ్ కోసం చిట్కాలు (Unsplash)

మహిళలు ఎదుర్కొనే సమస్యలు చాలా ఉంటాయి. కొన్ని సమస్యలైతే బాగా ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి భుజాల నుంచి జాకెట్ జారిపోవడం. పాపం ఈ సమస్యతో కాస్త ఆందోళనగానే అనిపిస్తుంది. ఎన్నిసార్లు పైకి లాగినా... మళ్లీ మళ్లీ జాకెట్ భుజాల నుంచి కిందకు జరుగుతుంది. దీంతో లోపల వేసుకున్న బ్రా పట్టీ కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా అసౌకర్యంగా ఉంటుంది.

చీర కట్టుకునేటప్పుడు బ్లౌజ్ కాస్త వదులుగా ఉన్నా, తరచు భుజం మీద నుంచి జారుతుంది. లోపలి పట్టీ బయటకు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంది. ఇది దాదాపు అందరూ మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య. దీంతో టైలర్ దగ్గరికి తీసుకెళ్లి సరి చేసుకున్నా.. కొందరికి సెట్ అవుతుంది. మరికొందరికి సెట్ కాదు. బ్లౌజ్ లూజుగా ఉండడంతో ముఖ్యమైన ఫంక్షన్లకు కూడా చీర కట్టుకోకుండా వెళ్లేవారు చాలా మందే ఉన్నారు. కొంతమంది పరిస్థితుల కారణంగా అదే బ్లౌజ్ వేసుకుంటారు. మళ్లీ మళ్లీ జారిపోతున్న బ్లౌజ్ ని సరిచేసుకోవాల్సి వస్తుంది. దీనికి సింపుల్ సొల్యూషన్ ఉంది.

దీనికోసం మీరు సూది, దారం కొనాల్సిన పని లేదు. కాస్త తెలివిగా ఆలోచిస్తే సరిపోతుంది. కేవలం 2 రూపాయలు ఖర్చు చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు హాయిగా ఫంక్షన్లకు వెళ్లి రావొచ్చు. మార్కెట్‌లో చౌకైన డబుల్ సైడెడ్ బ్రా స్టిక్కర్లు దొరుకుతున్నాయి. వీటిని కొని మీరు వాడుకోవచ్చు. ఇది రెండు వైపులా గమ్ ఉన్న పారదర్శక గమ్ స్టిక్కర్. మీరు బ్లౌజ్ ఎక్కడ కిందకు జారుతుంతో అక్కడ ఈ స్టిక్కర్ అతికించాలి. ఈ స్టిక్కర్‌ను అతికించాక తర్వాత పైన వైపు ఉన్న గమ్ స్టిక్కర్ కూడా తీసేయాలి. దానిపైకి బ్లౌజ్‌ను లాగి అతికించాలి. ఇది చర్మానికి బ్లౌజ్‌కి గమ్ లాగా అతికి ఉంటుంది. తరువాత జాకెట్టును అతుక్కునే ఉంటుంది. మీరు ఏదైనా ప్రోగ్రామ్‌ వెళితే దానిపై దృష్టి పెట్టవచ్చు. ఆన్‌లైన్‌లోనూ ఈ డబుల్ సైడెడ్ బ్లా స్టిక్కర్లు దొరుకుతున్నాయి.

ఈ బ్రా స్టిక్కర్ బ్లౌజ్ సమస్యకు మాత్రమే కాకుండా, ఏదైనా టాప్ వేసుకున్నప్పుడు బ్రా స్ట్రిప్స్ కనిపించే సమస్యకైనా ఉపయోగించవచ్చు. మరేదైనా టాప్ కొద్దిగా కిందకు వెళ్లి చికాకు కలిగిస్తే.. ఈ స్టిక్కర్ సహాయంతో టాప్ జారకుండా ఉంచవచ్చు. టాప్స్ వేసేటప్పుడు స్టిక్కర్ వేస్తే వంగేటప్పుడు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ స్టిక్కర్‌ని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. మహిళలకు చాలా ఉపయోగకరమైన ఈ స్టిక్కర్లు ప్రతి స్త్రీ కిట్‌లో తప్పనిసరిగా ఉంటే మంచిది. అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇది. కాబట్టి కచ్చితంగా ఇది వాడుకోండి. ఏదైనా కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు వీటిని ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు. కేవలం రెండు రూపాయలు మాత్రమే ఒక స్టిక్కర్ కు పడుతుంది. అయితే ఎవరికైనా చర్మ చికాకు ఉంటే మాత్రం వాడకపోవడమే మంచిది. కొందరికి ఇలాంటి గమ్ స్టిక్కర్లు చర్మానికి ఎర్రగా, దద్దుర్లు వచ్చేలా చేస్తాయి. అలాంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Whats_app_banner