WhatsApp new feature : ఇక వాట్సాప్‌లోనే 'స్టిక్కర్స్'.. కొత్త ఫీచర్ వచ్చేస్తోంది!
WhatsApp new feature : వాట్సాప్‌లో స్టిక్కర్ టూల్ త్వరలోనే అందుబాటులోకి వస్తోందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఇక స్టిక్కర్స్ కోసం థర్ట్ పార్టీ యాప్స్‌ను వాడాల్సిన అవసరం ఉండదు.
WhatsApp new feature : కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తుంది సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్. ఇక ఇప్పుడు.. ఈ మెటా ఆధారిత సంస్థ మరో కొత్త ఆప్షన్‌ను తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. వాబీటాఇన్ఫో ప్రకారం.. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టిక్కర్స్‌ను ఇక వాట్సాప్‌లోనే తయారు చేసుకోవచ్చు! ముందుగా దీని ఐఓఎస్ వర్షెన్ లాంచ్ అవుతుందని సమాచారం.
కొత్త ఫీచర్ ఇదేనా?
WhatsApp sticker tool : ఈ 'న్యూ స్టిక్కర్' ఆప్షన్.. ఛాట్లోనే అందుబాటులో ఉంటుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలోనే ఉన్నట్టు, ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందనే విషయంపై స్పష్టత లేదని వివరించింది. అయితే.. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ గ్యాలరీలోని ఫొటోను తీసుకుని ఎడిట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇందుకోసం ఛాట్‌లో టూల్స్ ఉంటాయని, వీటితో ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌ను పూర్తిగా తొలగించి స్టిక్కర్లు చేసుకోవచ్చని వెల్లడించింది.
WhatsApp new sticker feature : స్టిక్కర్స్ కోసం యూజర్లు ప్రస్తుతం థర్డ్ పార్టీ యాప్స్‌ను వినియోగిస్తున్నారు. ఇక ఈ స్టిక్కర్ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. ఇతర యాప్స్ అవసరం లేకుండానే ఛాట్ చేసుకోవచ్చు!
ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉండటంతో, దీనిపై పెద్దగా సమాచారం లేదు. రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:- WhatsApp : మీ పడకగదిలోని మాటలను వాట్సాప్ వింటోందట.. నిజమేనా?
లాక్ ఛాట్ ఫీచర్ వచ్చేస్తోంది.!
WhatsApp latest features : వాట్సాప్ కొత్త ఫీచర్‌కు సంబంధించి, ఇటీవలే ఒక వార్త బయటకొచ్చింది. 'లాక్ ఛాట్' ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తున్నట్టు సమాచారం.
"ఛాట్ లాక్‌ను మీ ముందుకు తీసుకొస్తుండటం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. మీ కీలకమైన ఛాట్స్‌కు ఇది అదనపు భద్రతను కల్పిస్తుంది," అని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.
WhatsApp chat lock feature : ఏదైనా ఛాట్‌ను లాక్ చేస్తే.. అది ఇన్‌బాక్స్‌లో ఇక కనిపించదు! ఈ ఛాట్ మరో ఫోల్డర్‌కు మారిపోతుంది. ఆ ఫోల్డర్‌ను పాస్వర్డ్ లేదా ఫింగర్‌ప్రింట్‌తోనే ఓపెన్ చేయగలరు. సంబంధిత ఛాట్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా.. ఆ నోటిఫికేషన్ ఆటోమెటిక్‌గా హైడ్ అయిపోతుంది.
ఈ లాక్ ఛాట్ ఫీచర్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం