Whatsapp Chat lock : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మీ ఛాట్స్‌ను 'లాక్' చేసేయండి..!
WhatsApp Chat lock feature : వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వచ్చింది. అదే ఛాట్ లాక్. దీని విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..
WhatsApp Chat lock feature : కొత్త కొత్త ఫీచర్స్‌తో యూజర్లను ఆకర్షిస్తూ ఉంటుంది సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్. ఇక ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. అదే.. 'ఛాట్ లాక్' ఫీచర్. ఈ ఫీచర్‌తో వినియోగదారుల ఛాట్స్‌కు అదనపు భద్రత లభిస్తుందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.
"ఛాట్ లాక్‌ను మీ ముందుకు తీసుకొస్తుండటం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. మీ కీలకమైన ఛాట్స్‌కు ఇది అదనపు భద్రతను కల్పిస్తుంది," అని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.
వాట్సాప్‌లో ఛాట్ లాక్‌ను ఎలా వాడాలి..?
ఏదైనా ఛాట్‌ను లాక్ చేస్తే.. అది ఇన్‌బాక్స్‌లో ఇక కనిపించదు! ఈ ఛాట్ మరో ఫోల్డర్‌కు మారిపోతుంది. ఆ ఫోల్డర్‌ను పాస్వర్డ్ లేదా ఫింగర్‌ప్రింట్‌తోనే ఓపెన్ చేయగలరు. సంబంధిత ఛాట్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా.. ఆ నోటిఫికేషన్ ఆటోమెటిక్‌గా హైడ్ అయిపోతుంది.
Chat lock feature in WhatsApp : "రానున్న నెలల్లో ఈ ఛాట్ లాక్ ఫీచర్‌కు మరిన్ని ఆప్షన్స్ తీసుకొస్తాము. యునీక్ పాస్‌వర్డ్‌తో లాక్ చేసుకునే వెసులుబాటును కల్పించడం ఇందులో ఒకటి," అని ఈ ఫేస్బుక్ ఆధారిత వాట్సాప్ పేర్కొంది.
మీ ఛాట్‌ను లాక్ చేయండిలా..
స్టెప్ 1:- ముందుగా మీ వాట్సాప్‌ను అప్డేట్ చేయండి. లేటెస్ట్ వర్షెన్ డౌన్లోడ్ అవుతుంది.
స్టెప్ 2:- మీరు ఏ ఛాట్‌ని లాక్ చేయాలని భావిస్తున్నారో.. దాని ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయండి.
WhatsApp new features : స్టెప్ 3:- మీకు కొత్తగా ఓ ఆప్షన్ కనిపిస్తుంది. అదే 'ఛాట్ లాక్'. డిసప్పియరింగ్ మెసేజ్ మెన్యూ కింద ఉంటుంది.
స్టెప్ 4:- ఛాట్ లాక్‌ను ఎనెబుల్ చేయండి. ఇందుకు మీరు పాస్వర్డ్ లేదా ఫింగర్‌ప్రింట్ ఇవ్వాల్సి ఉంటుంది.
How to use Chat lock feature in WhatsApp : లాక్ చేసిన ఛాట్‌ను చూడాలంటే.. మీ వాట్సాప్ హోం పేజ్ని కిందకి స్వైప్ చేయండి. అప్పుడు మీరు పాస్వర్డ్ లేదా ఫింగర్‌ప్రింట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.
పడకగది మాటలు వింటున్న వాట్సాప్..?
WhatsApp microphone usage : వినియోగదారుల ప్రైవసీ కోసం ఎన్ని చర్యలు చేపడుతున్నా.. వాట్సాప్‌పై మాత్రం విమర్శలు వస్తూనే ఉన్నాయి. 'మీ పడకగది మాటలను వాట్సాప్ వింటోంది.. జాగ్రత్త!' అంటూ పలువురు ఆరోపించడం తాజాగా కలకలం సృష్టించింది.
వాట్సాప్ మైక్రోఫోన్స్పై వివాదం గత కొంతకాలంగా కొనసాగుతోంది. ఇక ఇప్పుడు.. యూజర్లు నిద్రపోతున్నప్పుడు కూడా ఇవి యాక్టివ్‌గా ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం