OPPO F23 5G launch : ఒప్పో ఎఫ్​23 5జీ లాంచ్​.. ఫీచర్స్​, ధర వివరాలివే..!-oppo f23 5g launched in india should you buy see features price and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oppo F23 5g Launch : ఒప్పో ఎఫ్​23 5జీ లాంచ్​.. ఫీచర్స్​, ధర వివరాలివే..!

OPPO F23 5G launch : ఒప్పో ఎఫ్​23 5జీ లాంచ్​.. ఫీచర్స్​, ధర వివరాలివే..!

Sharath Chitturi HT Telugu
May 15, 2023 08:10 PM IST

OPPO F23 5G : ఒప్పో ఎఫ్​23 5జీ లాంచ్​ సోమవారం లాంచ్​ అయ్యింది. ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఒప్పో ఎఫ్23 5జీ వచ్చేసింది
ఒప్పో ఎఫ్23 5జీ వచ్చేసింది ((Photo: Oppo))

OPPO F23 5G launch in India : ఒప్పో సంస్థ.. మరో స్మార్ట్​ఫోన్​ను ఇండియాలో లాంచ్​ చేసింది. దాని పేరే ఒప్పో ఎఫ్​23 5జీ. మిడ్​- బడ్జెట్​ కస్టమర్లను టార్గెట్​ చేస్తున్న ఈ డివైజ్​పై సంస్థ భారీ అంచనాలే పెట్టుకుంది. మరి మీరు ఈ స్మార్ట్​ఫోన్​ కొనాలా? వద్దా? ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధర వివరాలు తెలుసుకోండి మరి..

ఒప్పో ఎఫ్​23 5జీ- స్పెసిఫికేషన్స్​..

OPPO F23 5G price in India : ఇందులో సెంట్రల్​ అలైన్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​, సైడ్​ మౌంటెడ్​ బయోమెట్రిక్​ రీడర్​లు ఉన్నాయి. 6.72 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ (1080x2400 పిక్సెల్స్​) ఎల్​టీపీఎస్​ ఎల్​సీడీ స్క్రీన్​ దీని సొంతం. ఈ డివైజ్​ స్క్రీన్​ టు బాడీ రేషియో 91.4శాతం. కూల్​ బ్లాక్​, బోల్డ్​ గోల్డ్​ రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.

ఒప్పో ఎఫ్​23 5జీ- ఫీచర్స్​..

ఈ డివైజ్​లో ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంది. అంటే రేర్​లో.. 64ఎంపీ మెయిన్​ కెమెరా, 2ఎంపీ మాక్రో స్నాపర్​, 2ఎంపీ మైక్ర లెన్స్​లు వస్తున్నాయి. ఎల్​ఈడీ ఫ్లాష్​కూడా రేర్​లో వస్తోంది. ఇక సెల్ఫీ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.

ఇదీ చూడండి:- Realme 11 Pro plus : రియల్​మీ 11 ప్రో ప్లస్​ లాంచ్​ రేపే.. ఫీచర్స్​ ఇవే!

OPPO F23 5G launch date : ఈ ఒప్పో ఎఫ్​23 5జీలో స్నాప్​డ్రాగన్​ 695 చిప్​సెట్​ ఉంటుంది. 8జీబీ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్​, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 67వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ దీని సొంతం.

కనెక్టివీ ఫీచర్స్​గా.. వైఫై 5, బ్లూటూత్​ 5.1, జీపీఎస్​, 3.5ఎంఎం జాక్​, టైప్​-సీ పోర్ట్​ వస్తున్నాయి.

ఒప్పో ఎఫ్​23 5జీ- ధర..

OPPO F23 5G features : ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 24,999గా ఉంది. ఒప్పో అధికారిక వెబ్​సైట్​ లేదా అమెజాన్​లో ఈ డివైజ్​ను ప్రీ బుక్​ చేసుకోవచ్చు. రూ. 2500 వరకు బ్యాంక్​ డిస్కౌంట్​, 6 నెలల వరకు నో కాస్ట్​ ఈఎంఐ వంటి ఆప్షన్స్​ కూడా ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం