Realme 11 Pro plus : రియల్​మీ 11 ప్రో ప్లస్​ లాంచ్​ రేపే.. ఫీచర్స్​ ఇవే!-realme 11 pro plus launching tomorrow on may 16 2023 heres everything to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme 11 Pro Plus : రియల్​మీ 11 ప్రో ప్లస్​ లాంచ్​ రేపే.. ఫీచర్స్​ ఇవే!

Realme 11 Pro plus : రియల్​మీ 11 ప్రో ప్లస్​ లాంచ్​ రేపే.. ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
May 15, 2023 11:20 AM IST

Realme 11 Pro plus : రియల్​మీ నుంచి మరో స్మార్ట్​ఫోన్​ సిరీస్​ ఇండియాలోకి అడుగుపెడుతోంది. ఇందులో రియల్​మీ 11 ప్రో ప్లస్​పై భారీ అంచనాలు ఉన్నాయి.

రియల్​మీ 11 ప్రో ప్లస్​ లాంచ్​ రేపే..
రియల్​మీ 11 ప్రో ప్లస్​ లాంచ్​ రేపే.. (HT TECH)

Realme 11 Pro plus launch date in India : మరో స్మార్ట్​ఫోన్​ సిరీస్​ను ఇండియాలో లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది రియల్​మీ. ఈ సిరీస్​లో 11 ప్రో 5జీ, 11 ప్రో ప్లస్ 5జీ​ వేరియంట్లు ఉండనున్నాయి. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​ మంగళవారం లాంచ్​కానున్నాయి. కాగా.. రియల్​మీ 11 ప్రో ప్లస్​పై గ్యాడ్జెట్​ ప్రియుల్లో ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య లాంచ్​ అవుతున్న ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

రియల్​మీ 11 ప్రో ప్లస్​- స్పెసిఫికేషన్స్​..

ఈ స్మార్ట్​ఫోన్​లో టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​, కర్వ్​డ్​ ఎడ్జెస్​, ఇన్​- డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ స్కానర్​లు ఉంటాయి. లీచీ లెథర్​ బ్యాక్​ ప్యానెల్​ వస్తుండటంతో లుక్​ మరింత ఆకర్షణీయంగా మారనుంది. సన్​రైజ్​ బీగ్​, ఒయాసిస్​ గ్రీన్​, ఆస్ట్రల్​ బ్లాక్​ వంటి రంగుల్లో ఈ మోడల్​ లాంచ్​ అవ్వొచ్చు.

Realme 11 Pro plus price : ఈ గ్యాడ్జెట్​లో డైమెన్సిటీ 7050 ఎస్​ఓసీ చిప్​సెట్​, ఆండ్రాయిడ్​ 13 ఆధారిత రియల్​మీ యూఐ 4.0, 5000ఎంఏహచ్​ బ్యాటరీ, 100వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ వంటివి ఉండొచ్చు. ఈ 5జీ స్మార్ట్​ఫోన్​లో వైఫై 6, బ్లూటూత్​ 5.2, జీపీఎస్​, ఎన్​ఎఫ్​సీ, టైప్​- సీ పోర్ట్​ కనెక్టివిటీ ఆప్షన్స్​ ఉండనున్నాయి.

ఇదీ చూడండి:- Samsung Galaxy S23 Ultra Limited Edition : ఈ లిమిటెడ్​ ఎడిషన్​​తో ఎన్నో ప్రయోజనాలు!

రియల్​మీ 11 ప్రో ప్లస్​- కెమెరా..

ఈ రియల్​మీ 11 ప్రో ప్లస్​లో ట్రిపులర్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. రేర్​లో 200ఎంపీ శామ్​సంగ్​ ఐఎస్​ఓసీఈఎల్​ఎల్​ హెచ్​పీ3 మెయిన్​ సెన్సార్​, 8ఎంపీ అల్ట్రా వైడ్​ షూటర్​, 2ఎంపీ మాక్రో లెన్స్​లు వస్తున్నాయి. ఇక సెల్ఫీ కోసం ఫ్రెంట్​లో 32ఎంపీ కెమెరా లభిస్తుండటం విశేషం.

రేర్​ కెమెరాతో 4కే వీడియోలు షూట్​ చేసుకోవచ్చు.

రియల్​మీ 11 ప్రో ప్లస్​- ధర..

Realme 11 Pro plus price in India : రియల్​మీ 11 ప్రో ప్లస్​ ధర వివరాలు ఇంకా అందుబాటులో లేవు. కాగా.. ఈ డివైజ్​ రూ. 30,000 సెగ్మెంట్​లో ఇండియా మార్కెట్​లోకి లాంచ్​ అవ్వొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. మంగళవారం లాంచ్​ అయిన తర్వాత కాన్ఫిగరేషన్స్​, ఫీచర్స్​, ధర వంటి వివరాలపై మరింత స్పష్టత వస్తుంది.

ఈ రియల్​మీ 11 సిరీస్​ ఇటీవలే చైనాలో లాంచ్​ అయ్యింది. ఈ సిరీస్​ ఇంకా సేల్​లోకి వెళ్లలేదు.

WhatsApp channel

సంబంధిత కథనం