Samsung Galaxy S23 Ultra Limited Edition : ఈ లిమిటెడ్ ఎడిషన్‌తో ఎన్నో ప్రయోజనాలు!
Samsung Galaxy S23 Ultra Limited Edition : శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా లిమిటెడ్ ఎడిషన్ బాక్స్‌ను ఆ సంస్థ ఆవిష్కరించింది. ఈ ఎడిషన్‌తో కస్టమర్లకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి!
Samsung Galaxy S23 Ultra Limited Edition : సరికొత్త గెలాక్సీ ఎస్23 అల్ట్రా లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ఆవిష్కరించింది దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్సంగ్. ఈ మేరకు ఓ రీటైల్ బాక్స్‌ను విడుదల చేసింది. ఆ బాక్స్‌లో స్మార్ట్‌ఫోన్‌తో పాటు శామ్సంగ్ స్మార్ట్‌వాచ్, వయర్లెస్ ఛార్జర్లు వస్తున్నాయి. ఈ కాంబో ప్యాక్ కొంటే కస్టమర్లకు భారీగా ఆదా అవుతుందని తెలుస్తోంది.
అయితే.. ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్యాకేజ్.. మే 31న వియాత్మంలో సేల్కు వెళుతుంది. షాపీతో పాటు శామ్సంగ్ వెబ్సైట్లో దీనిని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇండియాలో దీని లాంచ్‌పై ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేవు.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా లిమిటెడ్ ఎడిషన్..
Samsung Galaxy S23 Ultra price : ఈ లిమిటెడ్ ఎడిషన్ బాక్స్‌లో గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ వాచ్ 5 (బ్లూ సఫైర్, 44ఎంఎం), 15వాట్ వయర్లెస్ డ్యూయెల్ ఛార్జర్లు ఉన్నాయి. ఈ ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌తో పాటు వాచ్‌ని కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి:- Xiaomi 13 Ultra vs Samsung Galaxy S23 Ultra : ఈ రెండు ‘అల్ట్రా’ ఫోన్స్‌లో ఏది బెస్ట్?
వియాత్మంలో ఈ బాక్స్ విలువ 31990000 వియత్నామీస్ డాంగ్లు. అంటే సుమారు రూ. 1.12లక్షలు. ఈ వస్తువులను విడివిడిగా కొంటే.. ధర ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే.. ఈ లిమిటెడ్ ఎడిషన్‌తో కస్టమర్లకు మంచి డీల్ దొరుకుతున్నట్టే!
శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫీచర్స్..
Samsung Galaxy S23 Ultra price in India : ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 ఇంచ్ క్యూహెచ్డీ+ ప్యానెల్, స్టైలస్ సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్లు ఉన్నాయి. 12జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ దీని సొంతం. 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 45డబ్ల్యూ వయర్డ్, 15డబ్ల్యూ వయర్లెస్, 4.5 రివర్స్ వయర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది.
Samsung Galaxy S23 Ultra features : ఇక కెమరా ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో 200ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా వైడ్, 10ఎంపీ టెలీఫొటో స్నాపర్, 10ఎంపీ పెరిస్కోప్ లెన్స్‌లు ఉన్నాయి. ఫ్రెంట్లో సెల్ఫీ కోసం 12ఎంపీ కెమెరా లభిస్తోంది. ఈ డివైజ్.. 8కే వీడియోస్‌ను షూట్ చేయగలదు.
సంబంధిత కథనం